ఫోటో స్టోరి: సన్నీలియోన్ మెరుపులు ఉరుములు
మరోవైపు సన్నీలియోన్ తన సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతోను అభిమానులకు టచ్ లో ఉంది.
By: Tupaki Desk | 1 July 2025 3:27 PM ISTశృంగార తార సన్నీలియోన్ కొంత కాలంగా నటనా కెరీర్ పరంగా స్తబ్ధుగా ఉన్న సంగతి తెలిసిందే. సరోగసీలో మామ్ అయిన సన్నీలియోన్, తన కిడ్స్ పెంపకం బాధ్యతను నిర్వహిస్తూనే, పలువురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తోంది. సన్నీ - ది బెస్ట్ మామ్! అన్న మంచి పేరు తెచ్చుకుంటోంది. యుక్తవయసులో తన జీవనశైలికి భిన్నమైన లైఫ్ స్టైల్ తన పిల్లలకు ఇవ్వాలని తపిస్తోంది ఈ బాధ్యతాయుతమైన మమ్.
మరోవైపు సన్నీలియోన్ తన సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతోను అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా సన్నీ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇది వెండి తళుకుల గౌన్. సిల్వర్ లైనింగ్ ట్రెంచ్ కోట్ తో ఒక మైమరపు. మెరుపులు మిరుమిట్ల బ్లౌజ్ దానికి సరిపోయే స్కర్ట్ ధరించిన సన్నీలియోన్ ఎంతో అందంగా కనిపిస్తోంది. తన అందాలను ఎలివేట్ చేస్తున్న ఈ బ్లౌజ్ కి తగ్గట్టే, కాంబినేషన్ లాంగ్ సిల్వర్ కోట్ ని ఎంపిక చేసుకుని మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం సన్నీ స్పెషల్ లుక్ కి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. `సన్నీ కిల్లింగ్ ఎగైన్` అంటూ అభిమానులు ఈ ఫోటోలను వైరల్ గా షేర్ చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, సన్నీలియోన్ ప్రస్తుతం ఓ సౌత్ సినిమాలో నటిస్తోంది. తమిళం - తెలుగులో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ దశకు చేరుకుంది. టైటిల్ లాంచ్ సహా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది. మరోవైపు సన్నీ లియోన్ హాలీవుడ్‌లో అరంగేట్రం చేయనుందని సమాచారం. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో సన్నీ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక సైనికురాలిగా కనిపిస్తుంది. ఇప్పటికే సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీకయ్యాయి. సైనిక దుస్తులు ధరించి, ఆయుధం పట్టుకుని వార్ జోన్‌లో తీవ్ర పరిస్థితుల్లో సన్నీ కనిపిస్తోంది.
సన్నీ చివరిసారిగా ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా X5 హోస్ట్‌గాను కనిపించింది. తదుపరి నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతోందని, పలు దక్షిణాది చిత్రాల్లో నటించనుందని కూడా తెలుస్తోంది.
