ఆ పాత్రపై యాక్షన్ స్టార్ సంచలన కామెంట్!
ఇప్పటికే చాలా మంది నటీనటులు షూట్ లో భాగమయ్యారు. త్వరలో సన్ని డియోల్ కూడా సెట్స్ కు హాజరుకానున్నాడు.
By: Tupaki Desk | 8 April 2025 9:31 AMబాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా `రామాయణం` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ కాన్వాస్ పై చిత్రం తెరకెక్కుతోంది. రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నాడు. యశ్ రావణుడి పాత్రలో, కై కై పాత్రలో లారా దత్తా, రవి దూబే లక్ష్మణుడి పాత్రతో , రకుల్ ప్రీత్ సింగ్ సూర్పణక పాత్రలో, సన్ని డియోల్ హనుమంతుడి పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది నటీనటులు షూట్ లో భాగమయ్యారు. త్వరలో సన్ని డియోల్ కూడా సెట్స్ కు హాజరుకానున్నాడు. ఈ సందర్భంగా సన్ని డియోల్ లైన్ లోకి వచ్చాడు. `భగవంతుడి వల్లే ఈరోజు ఇలా ఉన్నాం. నేను దేవుడిని నమ్ముతాను. రామాయణంలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నాను. నటుడిగా నాకిది సవాల్ తో కూడిన పాత్ర. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి పాత్రలు బాగా ఇష్టపడి చేస్తాను.
ఎందుకంటే ఇవి చాలా సరదాగా ఉంటాయి. ఇంకా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. ఈ సినిమా చూసి ప్రజలంతా ఆశ్చర్యపోతారు. సినిమా బాగా వస్తుందన్నారు. అలాగే ఈ సినిమా `అవతార్`, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ `తరహాలో రామాయణం చాలా పెద్ద ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుందని రివీల్ చేసారు. అద్బుతమైన విజువల్స్ ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ప్రపంచంలో అందరికీ నచ్చే సినిమా రామాయణం అవుతుందన్నారు.
ప్రస్తుతం సన్ని డియోల్ టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన `జాట్` లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సన్ని డియోల్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ ఈ చిత్రం వారం గ్యాప్ లో రిలీజ్ అవుతుంది.