Begin typing your search above and press return to search.

బాలయ్య సినిమాలో అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్న?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   1 May 2025 12:30 AM
Sunny Deol In Akhanda 2
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అఖండ బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాంతో అఖండ 2 సినిమాపై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. పైగా బాలకృష్ణ నటించిన ఇటీవల సినిమాల వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌గా నిలిచాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అఖండ 2 సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసంతో నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.

డాకు మహారాజ్ సినిమాలో పవర్‌ ఫుల్‌ స్టైలిష్ విలన్‌గా బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ నటించిన విషయం తెల్సిందే. ఇటీవల తెలుగు ప్రేక్షకులకు బాబీ డియోల్‌ తెగ నచ్చేస్తున్నాడు. అతడి నటన, అతడి స్క్రీన్‌ అప్పియరెన్స్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కెరీర్ ఖతం అనుకున్న బాబీ డియోల్‌కి తెలుగు దర్శకుడు సందీప్‌ వంగ 'యానిమల్‌' సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. దాంతో తెలుగులో బాబీ డియోల్‌ ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. తమ్ముడు బాబీ డియోల్‌ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో అన్న సన్నీ డియోల్‌ సైతం తెలుగులో ఎంట్రీకి సిద్ధం అయ్యాడు.

చాలా కాలంగా సరైన హిట్‌ లేక ఢీలా పడ్డ స్టార్‌ నటుడు సన్నీ డియోల్‌కి గదర్‌ 2 సినిమాతో మంచి బ్లాక్ బస్టర్‌ దక్కింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడంతో మరోసారి బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌ బిజీ అయ్యాడు. గదర్ 2 సినిమా తర్వాత సన్నీ డియోల్‌ నుంచి జాట్‌ సినిమా వచ్చింది. తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న అఖండ 2 సినిమాలో సన్నీ డియోల్‌ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే జరగబోతున్న జార్జియా షెడ్యూల్‌లో సన్నీ డియోల్‌ పాల్గొనబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అఖండ 2 సినిమాలో బాలకృష్ణ అఘోర గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఆ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఆ సీన్స్‌లో విలన్‌ రోల్‌ను బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ డియోల్‌తో చేయిస్తే కచ్చితంగా మంచి స్పందన దక్కుతుందని మేకర్స్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ కావాలి అంటే సినిమాలో ఆయన ఉండాలని భావిస్తున్నారు. బాలీవుడ్‌లో అఖండ 2 సినిమాకు మంచి వసూళ్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సనాతన ధర్మ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా బాలీవుడ్‌ స్టార్‌ కాస్ట్‌ ఈ సినిమాలో ఉంటే హిందీ ప్రేక్షకులు అఖండ 2 కి క్యూ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.