Begin typing your search above and press return to search.

హ‌నుమంతుడు సిద్దం...ప‌ర్వ‌తం ఎత్త‌డ‌మే ఆల‌స్యం!

బాలీవుడ్ లో నితీష్ తివారీ ద‌ర్వ‌క‌త్వంలో `రామాయ‌ణం` ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 July 2025 8:15 AM IST
హ‌నుమంతుడు సిద్దం...ప‌ర్వ‌తం ఎత్త‌డ‌మే ఆల‌స్యం!
X

బాలీవుడ్ లో నితీష్ తివారీ ద‌ర్వ‌క‌త్వంలో `రామాయ‌ణం` ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్...సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి...రావ‌ణాసురుడు పాత్ర‌లో య‌శ్, కైకేయిగా లారాద‌త్తా, శూర్ఫ‌ణ‌క‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్నారు. అయితే రామాయ‌ణంలో కీల‌క‌మైన హ‌నుమంతుడి పాత్ర విష‌యంలో మొన్న‌టి వ‌ర‌కూ స‌స్పెన్స్ కొన‌సాగింది. ఆ పాత్ర ఎవ‌రు పోషిస్తున్నారు? అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. చివ‌రికి పాత్ర‌కు బాలీవుడ్ న‌టుడు స‌న్ని డియోల్ ని ఎంపిక చేసారు.

రెండు భాగాలుగా తెర‌కెక్కుతోన్న `రామాయ‌ణం` ఇప్ప‌టికే మొద‌టి భాగం షూటింగ్ పూర్త‌యింది. మ‌రి హ‌నుమంతుడు లేకుండా మొద‌టి భాగం ఎలా ముగించారు? అంటే రెండ‌వ భాగంతో పాటు ఆ పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేస్తున్నారు. పైగా మొద‌టి భాగంలో హ‌నుమంతుడి పాత్ర కూడా కేవ‌లం 15 నిమిషాలే ఉంటుంద‌ని వినిపిస్తుంది. రెండ‌వ భాగంలో మాత్రం సినిమా అంతా ఆ రోల్ ట్రావెల్ అవు తుంది. లంక‌ను త‌గ‌ల‌బెట్టింది హ‌నుమంతుడే కాబ‌ట్టి వార్ స‌న్నివేశాల్లో ఆ పాత్ర హైలైట్ అవ్వ‌డం ఖాయం.

ఈ నేప‌థ్యంలో తాజాగా స‌న్ని డియోల్ హ‌నుమంతుడి రోల్ చిత్రీక‌ర‌ణ‌కు రెడీ అవుతున్న‌ట్లు ఓ వార్త తెర‌పై కి వ‌చ్చింది. పాత్ర కోసం స‌న్ని సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొద‌టి భాగానికి సంబంధించిన 15 నిమి షాల షూట్ తో పాటు, రెండ‌వ భాగం షూటింగ్ లో కంటున్యూటీగా పాల్గొంటాడు. దీనికి సంబంధించి మే క‌ర్స్ నుంచి అధికారికంగా క‌న్ప‌ర్మేష‌న్ రావాల్సి ఉంది. రామ‌-రావ‌ణ యుద్దం అన్న‌ది రెండ‌వ భాగంలో మొద‌లవుతుంది.

ఈ నేప‌థ్యంలో హనుమంతుడి పాత్ర కూడా అక్క‌డే హైలైట్ అవుతుంది. లంక‌ను త‌గ‌ల‌బెట్ట‌డం... సంజీ వ‌ని కోసం ప‌ర్వాతాన్నే ఎత్తి తీసుకురావ‌డం వంటి స‌న్ని వేశాల‌న్ని హ‌నుమ‌తుడితోనే ఉంటాయి. కాబ‌ట్టి ఆ పాత్ర‌కు రెండ‌వ భాగంలో పెద్ద పీట వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సినిమాకు ఈ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక ర్ష‌ణ‌గా నిలుస్తాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.