అఖండ 3: సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న బిగ్ స్టార్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 - తాండవం’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 April 2025 9:00 PM ISTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 - తాండవం’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అఖండ సృష్టించిన ప్రభంజనం తర్వాత ఈ కాంబో నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ వీడియో విడుదలైనప్పటి నుంచే మూవీపై క్రేజ్ మామూలుగా లేదు. బాలయ్య మాస్ యాటిట్యూడ్, బోయపాటి మాస్ ట్రీట్‌మెంట్ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లవైపు రప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇంతలోనే అఖండ 3కి సంబంధించిన ఆసక్తికర రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అఖండ 2 పూర్తి కాగానే అఖండ 3 ప్రీ-ప్లానింగ్ మొదలైనట్టు టాక్. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్‌తో కూడిన విలన్ క్యారెక్టర్‌లను ఫిక్స్ చేయాలనే ఆలోచన బోయపాటి టీం చేస్తున్నట్టు సమాచారం. అఖండ 2లో సంజయ్ దత్ పాత్ర మేజర్ అట్రాక్షన్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అఖండ 3 కోసం సన్నీ డియోల్ పేరూ గట్టిగా వినిపిస్తోంది.
లేటెస్ట్ గా అఖండ 2 సినిమా జార్జియాలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌కు స్పెషల్ ఆకర్షణగా బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ జాయిన్ అవుతున్నారట. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సన్నీ డియోల్ ఈ సినిమాలో కేవలం గెస్ట్ రోల్‌లో మాత్రమే కనిపించబోతున్నారని తెలుస్తోంది. పూర్తి లెంగ్త్ విలన్ రోల్ అనుకోకుండా, ఒక కీలకమైన చిన్న పాత్రలో ఫుల్ పవర్ ప్యాక్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారని సమాచారం.
సన్నీ డియోల్ పాత్ర గురించి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఆయన గెస్ట్ రోల్ అఖండ ఫ్రాంచైజీలో మూడో భాగానికివేదిగా మారే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, సన్నీ డియోల్ అఖండ యూనివర్స్‌లో ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని రేపుతోంది. సన్నీ డియోల్ తన లేటెస్ట్ చిత్రం 'జాట్'తో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నారు. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా విజయంతో సన్నీ డియోల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.
ఈ హవాలో అఖండ 2లో గెస్ట్ రోల్ చేయడం ఆయన కెరీర్‌కు మరింత బూస్ట్ ఇచ్చేలా చేస్తుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. మొత్తం మీద అఖండ 2లో సన్నీ డియోల్ గెస్ట్ రోల్ సినిమాకు అదనపు మసాలా జోడించనుంది. బాలయ్య పవర్, బోయపాటి మాస్ ట్రీట్‌మెంట్‌తో కలిసి సన్నీ సర్ప్రైజ్ అప్పియరెన్స్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి అధికారిక వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.
