Begin typing your search above and press return to search.

స్టార్‌డ‌మ్ విష‌యంలో ఇప్ప‌టికీ త‌గ్గేదేలే

ఆరు ప‌దులు దాటిన వ‌య‌సులో చాలా మంది బాలీవుడ్ వెట‌ర‌న్ స్టార్స్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా మారి రాణిస్తుంటే స‌న్నీడియోల్ మాత్రం హీరో క్యారెక్ట‌ర్ల‌కు మించి త‌గ్గేదేలే అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2025 12:00 AM IST
స్టార్‌డ‌మ్ విష‌యంలో ఇప్ప‌టికీ త‌గ్గేదేలే
X

సినీ ఇండ‌స్ట్రీలో ఐదు ప‌దుల‌కు మించిన వ‌య‌సు వ‌ర‌కు స్టార్‌డ‌మ్‌ని కొన‌సాగించ‌డం అంత ఈజీ కాదు. అయితే అసాధ్యం అనుకున్న దాన్ని కొంత మంది స్టార్స్ సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ర‌జ‌నీకాంత్ 74 ఏళ్ల వ‌య‌సులోనే అదే స్టార్‌డ‌మ్‌ని కొన‌సాగిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని అందిస్తున్నారు. ఇక మ‌న తెలుగు స్టార్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మెగాస్టార్ చిరంజీవి ఆరు ప‌దులు మించిన వ‌య‌సులోనే అదే జోష్‌ని చూపిస్తూ ఇప్ప‌టికీ త‌గ్గేదేలే అంటున్నారు.

65 ఏళ్ల వ‌య‌సులో కింగ్ నాగార్జున కొంత వ‌ర‌కు బ్యాలెన్స్ త‌ప్పి కీల‌క క్యారెక్ట‌ర్లు చేయ‌డానికి మొగ్గుచూపుతున్నా అదే ఏజ్‌లో ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ మాత్రం ఇప్ప‌టికీ స్టార్‌గానే, హీరోగానే కొన‌సాగుతానంటూ మీసం మెలేస్తున్నారు. ఇక వెంకీ మామ 64 ఏళ్ల వ‌యుసులో `సంక్రాంతికి వ‌స్తున్నాం` అంటూ త‌న‌దైన మార్కు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌తో నెట్టుకొస్తున్నారు. హీరోగానే కొన‌సాగుతున్నారు. ఇదే త‌ర‌హాలో ఇప్ప‌టీకి త‌గ్గేదేలే అంటున్నారు బాలీవుడ్ స్టార్ స‌న్నీడియోల్‌. జూన్ 18కి ఆయ‌న‌కు 67 పూర్త‌యి 68 ఏళ్లు వ‌స్తాయి.

ఆరు ప‌దులు దాటిన వ‌య‌సులో చాలా మంది బాలీవుడ్ వెట‌ర‌న్ స్టార్స్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా మారి రాణిస్తుంటే స‌న్నీడియోల్ మాత్రం హీరో క్యారెక్ట‌ర్ల‌కు మించి త‌గ్గేదేలే అంటున్నారు. అనిల్ క‌పూర్‌, సంజ‌య్‌ద‌త్‌, జాకీష్రాఫ్ త‌న స‌మ‌కాలికులు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా ట‌ర్న్ తీసుకున్నా స‌న్నీ మాత్రం హీరోగానే న‌టిస్తానంటూ సినిమాలు చేస్తున్నాడు. 1983లో న‌టుడిగా అరంగేట్రం చేసిన స‌న్నీ గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా హీరోగా కొన‌సాగుతూ మ‌న టాలీవుడ్ హీరోల త‌ర‌హాలో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

రీసెంట్‌గా `గ‌ద‌ర్ 2`తో ఇండియ‌న్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన స‌న్నీ `జాట్‌`తో ఫ‌రాలేద‌నిపించాడు. రూ.60 కోట్ల‌తో తీసిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో రూ.690 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌న్నీ స‌త్తా ఏంటో మ‌రోసారి నిరూపించింది. ప్ర‌స్తుతం స‌న్నీడియోల్ `లాహోర్ 1947`, బోర్డ‌ర్ 2, స‌ఫ‌ర్ వంటి సినిమాల్లో న‌టిస్తున్నాడు. వీటితో పాటు ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో నితీష్ తివారీ రూపొందిస్తున్న `రామ‌య‌ణ‌`లో హ‌నుమంతుడిగా క‌నిపించ‌బోతున్నాడు. నాలుగు ద‌శాబ్దాలుగా అదే క్రేజ్‌ని కొన‌సాగిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తుండ‌టం విశేషం.