స్పీడ్ తగ్గించకపోతే పట్టాలు తప్పడం ఖాయమే?
ప్రస్తుతం సన్ని డియోల్ 'బోర్డర్ 2' , 'లాహోర్: 1947' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు కూడా భారీ యాక్షన్ చిత్రాలే కావడంతో?
By: Tupaki Desk | 22 May 2025 5:00 PM ISTబాలీవుడ్ స్టార్ సన్ని డియోల్ మంచి ఫాంలో ఉన్నాడు. 'గదర్2' భారీ విజయం సాధించడంతో? సన్నికి ఆ చిత్రం మంచి కంబ్యాక్ లా నిలిచింది. 500 కోట్ల వసూళ్లతో సన్ని కెరీర్లో నే భారీ వసూళ్ల చిత్రంగా నిలి చింది. అటుపై రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ 'జాట్' కూడా మంచి విజయం సాధించింది. ఆద్యంతం యాక్షన్ సన్నివేశాల్లో సన్ని ఓ రేంజ్లో హైలైట్ అయ్యాడు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఫాం కోల్పోయిన సమయంలో సన్నికి వరుస విజయాలు పడటం..అవి యాక్షన్ థ్రిల్లర్లు కావడం బాగా కలిసొచ్చింది.
సన్ని డియోల్ మార్కెట్ మునుపటి కంటే రెట్టింపు అయింది. ఈ నేపథ్యలో సన్ని డియోల్ నెట్ ప్లిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదొక యాక్షన్-ప్యాక్డ్ ఫీచర్ ఫిల్మ్. 2007 లో కెవిన్ బేకన్ నటించిన 'డెత్ సెంటెన్స్' చిత్రం ఆధారంగా తెరకెక్కుతుంది. సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది జులైలో ప్రారంభించి వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాకు గాను సన్ని డియోల్ భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇదే సన్ని హాయ్యెస్ట్ రెమ్యునరేషన్ అవుతుందని బాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సన్ని డియోల్ 'బోర్డర్ 2' , 'లాహోర్: 1947' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు కూడా భారీ యాక్షన్ చిత్రాలే కావడంతో? వరుసగా ఇలా యాక్షన్ చిత్రాలు చేయడంతో సన్ని డియోల్ పై ఇలాంటి కథలకే పరిమితం అవుతాడా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొత్త జానర్లో ప్రయత్నాలు చేయకుండా కలిసొచ్చిందని యాక్షన్ చిత్రాలే పట్టుకుంటే కెరీర్ సల్మాన్ ఖాన్ లా స్లో అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సల్మాన్ ఖాన్ కూడా కొంత కాలంగా వరుసగా యాక్షన్ కంటెంట్ లోనే ఎక్కువగా కనిపించాడు. ఈ ఏడాది సికిందర్ తో ప్రేక్షకల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మురగదాస్ దర్శకత్వం వహించిన సినిమా కూడా రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ గా నే తేలిపోయింది. భారీ బడ్జెట్తో తీసిన 'టైగర్ 3', 'కిసీకా భాయ్ కిసీకా జాన్' కూడా లాభాలు ఆశించిన స్థాయిలో తేలేదు. దీంతో సల్మాన్ మార్కెట్ డౌన్ ఫాల్ అయిందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఫాంలో ఉన్న సన్ని డియోల్ కూడా అదే ట్రాక్ లో వెళ్తే కష్టమంటూహెచ్చరికలు షురూ అవుతున్నాయి.
