Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ కి అన్యాయం చేసిన గురూజీ..!

గుంటూరు కారం సినిమా స్టార్టింగ్ లోనే జగపతి బాబు బ్రదర్ పాత్రలో సునీల్ కనిపించాడు. ఆ పాత్రని అక్కడే ఎండ్ చేశాడు.

By:  Tupaki Desk   |   12 Jan 2024 2:30 PM GMT
ఫ్రెండ్ కి అన్యాయం చేసిన గురూజీ..!
X

స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ మహేష్ తో చేసిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన గుంటూరు కారం మూవీ టాక్ ఎలా ఉన్నా ఓవరాల్ గా మహేష్ బాబు వన్ మ్యాన్ షో తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్ త్రివిక్రం తన ఫ్రెండ్ కి అన్యాయం చేశాడని చెప్పుకుంటున్నారు. అదేంటి అంటే త్రివిక్రం ఫ్రెండ్ సునీల్ ఈ సినిమాలో ఉన్నాడని తెలిసిందే. త్రివిక్రం సినిమాల్లో సునీల్ కి మంచి పాత్ర దొరుకుతుందని అందరు భావిస్తారు. కానీ గుంటూరు కారం లో సునీల్ ని కేవలం ఒక్క సీన్ లో వాడాడు గురూజీ.

గుంటూరు కారం సినిమా స్టార్టింగ్ లోనే జగపతి బాబు బ్రదర్ పాత్రలో సునీల్ కనిపించాడు. ఆ పాత్రని అక్కడే ఎండ్ చేశాడు. సునీల్ ని అలాంటి చిన్న పాత్రకు తీసుకోవాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో కానీ త్రివిక్రం ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. తన సినిమాలో తన ఫ్రెండ్ ని భాగం చేయాలని అలా చిన్న పాత్రలో సునీల్ కి ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఈమధ్య తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతున్న సునీల్ ని ఇలా ఒక్క చిన్న సీన్ కోసం వాడటం మాత్రం నిరుత్సాహ పరుస్తుంది.

త్రివిక్రం మహేష్ కలిసి చేసిన అతడు సినిమాలో సునీల్ కి మంచి పాత్ర ఇచ్చాడు.. ఖలేజా సినిమాలో కూడా టీవీ ఛానెల్ ఉద్యోగిగా సునీల్ నటించాడు. ఆ రెండు సినిమాల్లో సునీల్ మార్క్ కామెడీ పండించడానికి ప్రయత్నించాడు. అయితే గుంటూరు కారం లో మొదటి సీన్ లోనే సునీల్ కనిపించే సరికి ఫ్రెండ్ కి మళ్లీ త్రివిక్రం బూస్టింగ్ ఇచ్చాడని అనుకోగా ఆ వెంటనే అతని పాత్రని ముగించేస్తాడు. ఆ తర్వాత ఆ పాత్రకు వెయిట్ కూడా ఉండేలా చేయలేదు.

సునీల్ హీరోగా చేసి ఆ ప్రయత్నాలు విరమించుకున్నాక మళ్లీ కమెడియన్ గా కొనసాగించాలి అనుకున్నప్పుడు త్రివిక్రం ఛాన్స్ ఇస్తూ వచ్చాడు. అయితే ఈమధ్య సునీల్ విలన్ గా ఇంప్రెస్ చేస్తున్న టైం లో సునీల్ ని ఆ యాంగిల్ లో వాడుకుంటే బాగుండేదని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. గుంటూరు కారం సినిమాలో సునీల్ రోల్ ఇలా వచ్చి అలా వెళ్లడం పట్ల సునీల్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలు లేకపోయినా బాగుండేది కానీ సునీల్ ని ఇలా చిన్న పాత్రకు తీసుకుని త్రివిక్రం తప్పు చేశాడని అంటున్నారు ఆడియన్స్.