Begin typing your search above and press return to search.

జైలర్ లో ఆ నటుడు, ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కొడుకు

కోదండ రామిరెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీలో కీలక పాత్రలో కనిపించాడు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 8:05 AM GMT
జైలర్ లో ఆ నటుడు, ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కొడుకు
X

టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి తెలియని వాళ్లు ఎవరూ ఉండరేమో. దాదాపు అందరు సీనియర్ హీరోలతో సినిమాలు తీసి, వారికి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాడు. అలాంటి డైరెక్టర్ కి తన కొడుకుతో సినిమా తీయడం చాలా చిన్న విషయం. కానీ, ఆయన కుమారుడు మాత్రం వేరే భాషలో స్టార్ డైరెక్టర్ల సినిమాలో చిన్న పాత్రలు చేస్తున్నాడు.

కోదండ రామిరెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీలో కీలక పాత్రలో కనిపించాడు. మీరు కనుక జైలర్ మూవీ చూసి ఉంటే సునీల్ రెడ్డి క్యారెక్టర్ మీరు గుర్తుపట్టే ఉంటారు. ఈ మూవీలో టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీలక పాత్ర నటించిన విషయం తెలిసిందే. సునీల్ హీరోగా అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. అయితే, సునీల్ పక్కనే మరో పాత్ర ఉంది. తమన్నాకీ, సునీల్ కి మధ్య దూరం పెంచే పాత్రలో ఓ వ్యక్తి నటించాడు.

ఆయన క్యారెక్టర్ ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. కమెడియన్ సునీల్ తో పాటు, ఈయన కూడా బాగా నవ్వించాడు. అయితే, ఈ వ్యక్తి ముఖంచూస్తుంటే ఎక్కడో చూసినట్లు ఉందే అని , ఎవరా అని ఆరా తీయగా కోదండరామి రెడ్డి పెద్ద కొడుకు అని తెలసింది. ఈ విషయం తెలిసి అందరూ షాకయ్యారు.

అంత పెద్ద డైరెక్టర్ కొడుకు అయ్యి ఉండి, ఇలాంటి చిన్న పాత్రలు చేస్తున్నాడేంటి అని షాకౌతున్నారు. సునీల్ రెడ్డి ఈ సినిమా మాత్రమే కాదు, చాలా సినిమాల్లో నటించాడు. ఎక్కువగా కామెడీ రోల్సే చేశాడు. డాక్టర్ మూవీలో ఆయన పాత్రకు బాగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ జైలర్ మూవీలో ఆయన పాత్రకు మంచి మైలేజ్ వచ్చింది.

ఇక, సునీల్ రెడ్డి తమ్ముడు వైభవ్ రెడ్డి హీరోగా గొడవ అనే సినిమాతో ఇండస్ట్రీకీ పరిచయం అయ్యాడు. అయితే, ఆ సినిమా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో, తమిళ ఇండస్ట్రీలో కి అడుగుపెట్టాడు. వైభవ్ సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత, సునీల రెడ్డి కమెడియన్ గా తన కెరీర్ ని ప్రారంభించడం గమనార్హం. ఏది ఏమైనా ఈ తెలుగు డైరెక్టర్ కుమారుడు, తమిళంలో సత్తా చాటుతున్నాడు.