Begin typing your search above and press return to search.

సునీల్.. మళ్ళీ డిమాండ్ పెరిగింది

హిందీలో కూడా కొంతమంది సునీల్ కోసం సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే సునీల్ ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ అయిపోయాడు.

By:  Tupaki Desk   |   25 Dec 2023 4:06 AM GMT
సునీల్.. మళ్ళీ డిమాండ్ పెరిగింది
X

కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోగా టర్న్ తీసుకొని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ లో డిఫరెంట్ భాషలలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నటుడు సునీల్. ప్రస్తుతం అతని కెరియర్ చూస్తుంటే తెలుగుకి మాత్రమే పరిమితం కాలేదు. తమిళంలో వరుస ప్రాజెక్ట్స్ తో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అలాగే కన్నడ, మలయాళీ భాషలలో కూడా అడుగుపెట్టాడు.

హిందీలో కూడా కొంతమంది సునీల్ కోసం సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే సునీల్ ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ అయిపోయాడు. పుష్ప సినిమాలో మంగళం శ్రీను క్యారెక్టర్ ఏ ముహూర్తంలో చేసాడో కానీ సునీల్ దశ మార్చేసింది. ఆ సినిమా ముందు వరకు అవకాశాల కోసం సునీల్ ఇబ్బంది పడ్డాడు.

హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న తర్వాత ఏవో చిన్న చిన్న పాత్రలు తప్ప చెప్పుకోదగ్గవి ఒక్కటి రాలేదు. అయితే సుకుమార్ మంగళం శ్రీను క్యారెక్టర్ లో సునీల్ ని డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేశారు. ఆ లుక్ సునీల్ ఇమేజ్ ని మార్చేసింది. తమిళంలో ఇప్పటికే అరడజను వరకు సినిమాలు చేసేశాడు.

ఇప్పుడున్న డిమాండ్ కారణంగా సునీల్ రోజుకి ఏడు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట. నిర్మాతలు కూడా ఈ మొత్తం ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. దానికి కారణం ప్రస్తుతం ఉన్న మార్కెట్ అని తెలుస్తోంది. అవకాశాలు నిండుగా వస్తూ ఉండటంతో అందుకు తగ్గట్లుగానే వసూళ్లు చేస్తున్నారు. నిర్మాతలు కూడా ఇవ్వడానికి రెడీగానే ఉంటున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ యాక్టర్ గా సక్సెస్ కావడానికి కారణం అయ్యాడని చెప్పాలి. అతని సినిమాలలో ఎన్నో అద్భుతమైన కామెడీ క్యారెక్టర్స్ సునీల్ కోసం డిజైన్ చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలలో సునీల్ చాలామంచి పాత్రలలో కనిపించాడు. గుంటూరు కారంలో అలాంటి క్యారెక్టర్ ఏమైనా సునీల్ కోసం డిజైన్ చేసాడేమో చూడాలి.