Begin typing your search above and press return to search.

సునీల్ మ్యాక్స్.. కెరీర్ పీక్స్..!

తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్న సునీల్ లేటెస్ట్ గా కెరీర్ లో మొదటిసారి కన్నడ నుంచి అవకాశం అందుకున్నాడు. కన్నడలో సుదీప్ హీరోగా చేస్తున్న మ్యాక్స్ సినిమాలో సునీల్ విలన్ గా ఛాన్స్ కొట్టేశాడు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 1:39 PM GMT
సునీల్ మ్యాక్స్.. కెరీర్ పీక్స్..!
X

స్టార్ కమెడియన్ సునీల్ ప్రస్తుతం తన సూపర్ ఫాం ని కొనసాగిస్తున్నాడు. తెలుగులో కేవలం కమెడియన్ గా చేసి హీరోగా ప్రయత్నాలు చేసిన సునీల్ విలన్ గా తన విలక్షణతను చూపించాలని అనుకున్నాడు. అయితే సునీల్ విలనిజం తెలుగు ఆడియన్స్ కన్నా తమిళ ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. పుష్పలో మంగళం శ్రీను పాత్రలో మెప్పించిన సునీల్ ఆ సినిమా క్రేజ్ తో తమిళంలో వరుస ఆఫర్లు అందుకున్నాడు. రజినీకాంత్ జైలర్, శివ కార్తికేయన్ మహావీరుడు, విశాల్ మార్క్ ఆంటోని సినిమాల్లో నటించాడు.


లేటెస్ట్ గా సునీల్ జపాన్ సినిమాలో కూడా నటించాడు. తమిళ మేకర్స్ తన మీద చూపిస్తున్న ప్రేమకి సునీల్ చాలా సంతోషంగా ఉన్నాడు. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్న సునీల్ లేటెస్ట్ గా కెరీర్ లో మొదటిసారి కన్నడ నుంచి అవకాశం అందుకున్నాడు. కన్నడలో సుదీప్ హీరోగా చేస్తున్న మ్యాక్స్ సినిమాలో సునీల్ విలన్ గా ఛాన్స్ కొట్టేశాడు. తెలుగులో ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్న సునీల్ తమిళ కన్నడ భాషల్లో కూడా పాగా వేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మ్యాక్స్ సినిమాలో సునీల్ పాత్ర కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.

సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ నటించడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా సూపర్ బజ్ ఏర్పడుతుంది. రాజమౌళి ఈగ సినిమాతో సుదీప్ కూడా తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత బాహుబలిలో చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన సుదీప్ కన్నడలో చేసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.

సుదీప్ మ్యాక్స్ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పరచుకున్నాడు. మ్యాక్స్ ని పాన్ ఇండియా వైడ్ గా భారీ స్కేల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సుదీప్ చేసే ఏ సినిమా అయినా భారీ క్రేజ్ తో వస్తుంది. తప్పకుండా సుదీప్ మ్యాక్స్ కమర్షియల్ గా కూడా వర్క్ అవుట్ అయ్యేలా ఉంటుందేమో చూడాలి. సుదీప్ సరసన సిమ్రత్, సంయుక్త హోర్నాడ్ నటిస్తున్న ఈ సినిమాకు అంజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.