Begin typing your search above and press return to search.

హరోమ్ హర.. సునీల్ మరో పవర్ఫుల్ రోల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు కమెడియన్ గా గుర్తింపు అందుకున్న సునీల్ ఇప్పుడు విలన్ గా తనదైన శైలిలో మెప్పిస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Nov 2023 1:47 PM GMT
హరోమ్ హర.. సునీల్ మరో పవర్ఫుల్ రోల్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు కమెడియన్ గా గుర్తింపు అందుకున్న సునీల్ ఇప్పుడు విలన్ గా తనదైన శైలిలో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో అతను చేసిన పాత్రకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు మిగతా భాషల్లో కూడా బిజీ అవుతున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా సునీల్ తన పాత్ర భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు.


జైలర్, మార్క్ ఆంటోని వంటి తమిళ సినిమాలలో కూడా సుధీర్ ఇటీవల మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక సునీల్ ప్రస్తుతం తెలుగులో కూడా మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇక అందులో

సుధీర్ బాబు హీరోగా చేస్తున్న పీరియాడికల్ యాక్షన్-డ్రామా చిత్రం "హరోమ్ హర" కూడా ఉంది. ఈ సినిమాను పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తోంది.

జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ పతాకంపై సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే అప్డేట్స్ మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించడం మరింత ఉత్కంఠను పెంచుతోంది. దీపావళి టీజర్ లాంచ్‌ను దృష్టిలో ఉంచుకుని, మేకర్స్ వ్యూహాత్మకంగా ప్రధాన పాత్రలను పరిచయం చేస్తున్నారు.

ఇక సుధీర్‌బాబు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన తర్వాత, పళని సామి పాత్రలో నటించిన సునీల్‌ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇటీవలి వరుస నెగిటివ్ షేడ్స్ లో మెప్పిస్తున్న సునీల్, ఇందులో కూడా నెగటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రతో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. పోస్టర్ తోనే సునీల్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని క్లారిటీ ఇచ్చేశారు.

చిత్రం యొక్క కథనం కుప్పం నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇక సుధీర్ బాబు కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది పాన్-ఇండియా అప్పీల్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ప్రమోషన్స్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు సునీల్ తెలుగులో పలు బిగ్ సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప 2లో కూడా అతని రోల్ ఇంకాస్త ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటుందట.