సునీల్ స్టైలిష్ లుక్.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సునీల్ ఆ మధ్య కాస్త స్లో అయినట్లు అనిపించుకున్నా మళ్లీ స్పీడ్ పెంచాడు.
By: Tupaki Desk | 8 Jun 2025 3:41 PM ISTటాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సునీల్ ఆ మధ్య కాస్త స్లో అయినట్లు అనిపించుకున్నా మళ్లీ స్పీడ్ పెంచాడు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కొన్నాళ్లకే తాను హీరోగా సెట్ కానని అనుకున్నాడు. అందుకే హీరోగా వరుస ఫ్లాప్స్ పడుతున్న సమయంలో కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. సునీల్ హీరోగా చేసిన తర్వాత కమెడియన్‌గా ఎవరు చూస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సునీల్ ను మళ్లీ కమెడియన్‌గా ప్రేక్షకులు ఆధరించారు. అయితే సునీల్ ఈసారి కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా విలన్ రోల్స్ చేయడం ద్వారా మరింతగా పాపులారిటీని సొంతం చేసుకునే ప్రయత్నం చేశాడు.
విలన్‌గా సునీల్ విశ్వరూపంను 'పుష్ప'లో చూశాం. కలర్ ఫోటోలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన సునీల్ బ్యాక్ టు బ్యాక్ విలన్ పాత్రలను చేస్తున్న విషయం తెల్సిందే. హీరోగా సినిమా ఆఫర్లు వస్తున్నా కామెడీ, విలన్ పాత్రలకే సునీల్ మొగ్గు చూపుతున్నాడు. పుష్ప లో విలన్‌గా నటించి మెప్పించిన తర్వాత ఇతర భాషల నుంచి ఎక్కువగా సునీల్‌కి విలన్ రోల్స్ ఆఫర్ వచ్చాయని తెలుస్తోంది. హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా విలనిజం ను పండించే సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో సునీల్ ఇతర భాషల సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాజాగా మలయాళం మూవీ 'కట్టలన్' లో సునీల్ నటించాడు. ఆంటోనీ వర్గీస్ ముఖ్య పాత్రలో నటించిన కట్టలన్ సినిమాలో సునీల్ విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఆ విషయం గురించి ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. తాజాగా సునీల్ ఆ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అనే విషయమై క్లారిటీ వచ్చింది. స్టైలిష్ విలన్ పాత్రలో సునీల్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నారు. అందుకు తగ్గట్లుగానే స్టైలిష్ లుక్‌లో సన్నని ఫిజిక్‌తో సునీల్ కనిపిస్తున్నాడు. సునీల్ హీరోగా నటించిన సమయంలో ఎలా అయితే సన్నగా కనిపించాడో అలాగే ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం సునీల్ కనిపించబోతున్నాడు. ఆ మధ్య బరువు పెరిగిన సునీల్ మళ్లీ బరువు తగ్గాడని ఈ స్టిల్‌ను చూస్తే అనిపిస్తుంది.
సునీల్ ను ఇక ముందు అన్ని విలన్ రోల్స్‌లోనే చూస్తామా అనే చర్చ జరుగుతోంది. సునీల్ ను కామెడీ పాత్రల్లో చూడాలని ఆశ పడుతున్న అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో సునీల్‌ను కామెడీ పాత్రల్లో కంటే విలన్ పాత్రల్లో చూడటం వల్ల అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ హీరోగా చేసినప్పుడు కూడా కామెడీ పాత్రలు చేస్తే బాగుంటుంది అని చాలామంది అన్నారు. కానీ ఆయన హీరోగా చేసేటప్పుడు కామెడీ పాత్రలు చేయలేదు. ఇప్పుడు కూడా సునీల్ అలాగే చేస్తున్నాడు. సునీల్ విలన్ పాత్రల్లో చేస్తూ కూడా అప్పుడప్పుడు కామెడీ చేస్తే బాగుంటుంది కదా అంటున్నారు. సునీల్ కట్టలన్ సినిమాలో స్టైలిష్ విలన్‌గా నటించి మరోసారి ఆకట్టుకోబోతున్నాడు. తెలుగులో సునీల్ పవర్ ఫుల్ రోల్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కామెడీ కూడా కోరుకుంటున్నారు.
