Begin typing your search above and press return to search.

సునీల్ పొలిటిక‌ల్ ఎంట్రీ!

న‌టుడిగా సునీల్ మ‌ళ్లీ బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. సెకెండ్ ఇన్నింగ్స్ లో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్షుక‌ల్ని అల‌రిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 April 2025 1:35 PM IST
సునీల్ పొలిటిక‌ల్ ఎంట్రీ!
X

న‌టుడిగా సునీల్ మ‌ళ్లీ బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. సెకెండ్ ఇన్నింగ్స్ లో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్షుక‌ల్ని అల‌రిస్తున్నారు. ఓవైపు సీరియ‌స్ పాత్ర‌లు పోషిస్తూనే అవే త‌ర‌హా పాత్ర‌ల్లో కామెడీని సైతం పండిస్తున్నాడు. గ‌త ఏడాదే 11 సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ ఏడాది ఇప్ప‌టికే రెండు సినిమాల‌తోనూ అల‌రించాడు. `రామం రాఘ‌వం`, `మ్యాడ్ స్క్వేర్` చిత్రాల‌తో మెప్పించాడు.

కొత్త‌గా మ‌రికొన్ని ప్రాజెక్ట్ లోనూ భాగ‌మ‌వుతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే సునీల్ పొలిటిక‌ల్ ఎంట్రీ కూడా ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌కీయ పాత్ర‌ల‌తోనూ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇంత‌కీ ఏంటా సినిమా? వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా కోలీవుడ్ లో వినోధ్ ద‌ర్శ‌క త్వంలో `జ‌న‌నాయ‌గ‌న్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ రాజ‌కీయంగా ఎంట్రీ ఇచ్చిన నేప థ్యంలో చేస్తోన్న తొలి పొలిటిక‌ల్ చిత్ర‌మిది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీని దృష్టిలో పెట్టుకుని విజ‌య్ ఈ త‌ర‌హా చిత్రానికి పూనుకున్నాడు. `జ‌న నాయ‌కుడు` పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌బోతున్నాడు. ఆయ‌న‌తో పాటు ఇదే సినిమాలో మ‌రికొంత మంది రాజ‌కీయ నాయ‌కుల పాత్ర‌లు పోషిస్తున్నారు. వారంతా త‌మిళ న‌టులే. అయితే ఓ త‌మిళ రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం సునీల్ కి ద‌క్కిందిట‌. సినిమాలో ఆ పాత్ర చాలా కీల‌క‌మని కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం మొద‌లైంది.

ఇది విజ‌య్ కి ప్ర‌త్య‌ర్ధి పాత్ర అంటున్నారు. సునీల్ ఆహార్యం, వైట్ అండ్ వైట్ గెట‌ప్ ఇంట్రెస్టింగ్ ఉంటుందంటున్నారు. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తేలాలి. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి పాత్ర పోషించే అవ‌కాశం సునీల్ కి తెలుగులో ఏ సినిమాలో రాలేదు. ఆ ర‌కంగా కోలీవుడ్ లో సునీల్ అరుదైన ఛాన్స్ అందుకుంటున్నాడు. ఇప్ప‌టికే త‌మిళ్ లో సునీల్ చాలా సినిమాలు చేసాడు. `జైల‌ర్` సినిమాతో మంచి పేరొచ్చింది. అదే ఇమేజ్ తో జ‌న‌నాయ‌గ‌న్ లోనూ ఛాన్స్ అందుకుంటున్నాడు.