Begin typing your search above and press return to search.

OTT దెబ్బ.. ఇలా పెద్దోళ్లే మాట తప్పితే ఎలా?

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఓటీటీ విషయంలో యూటర్న్ తీసుకున్నారా? తన ఆలోచన పంథాను మార్చుకున్నారా?

By:  Tupaki Desk   |   9 Oct 2023 9:30 AM GMT
OTT దెబ్బ.. ఇలా పెద్దోళ్లే మాట తప్పితే ఎలా?
X

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఓటీటీ విషయంలో యూటర్న్ తీసుకున్నారా? తన ఆలోచన పంథాను మార్చుకున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. 2021లో థియేటర్లలో రిలీజైన తన లవ్ స్టోరీ సినిమాకు పోటీగా ఓటీటీలో టక్ జగదీశ్ చిత్రం రిలీజ్ అవుతుంటే పెద్ద గొడవే చేశారు. సేవ్ థియేటర్స్​ అంటూ నిర్మాతలకు, అడియెన్స్​కు పెద్ద రిక్వెస్ట్ కూడా చేశారు. కానీ ఇప్పుడా మాటలను ఆయన గాలికొదేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళితే.. సునీల్ నారంగ నిర్మించిన లేటెస్ట్ మూవీ సుధీర్ బాబు మామా మశ్చీంద్ర.. తాజాగా రిలీజై భారీ డిజాస్టర్ టాక్​ను అందుకుంది. అయితే ఈ చిత్రం రిలీజైన మూడు రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీ రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది. అమెజాన్ ప్రైమ్​లో అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. అంటే థియేట్రికల్ రిలీజైన రెండు వారాల్లోనే సినిమా ఓటీటీలోకి దర్శనమివ్వనుంది.

దీంతో ప్రస్తుతం ఈ సినిమాను థియేటర్లలో చూడాలనుకున్న కొద్ది మంది కూడా.. ఇంకా రెండు వారాలే కదా అని థియేటర్లలో చూడటం మానేస్తారు. టికెట్లు కొనడానికి ఇష్టపడరు. అప్పుడు సునీల్​ నారంగ్ సేప్ థియేటర్స్ మోటో ఏమైనట్టు? ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్​మెంట్​ చేసి స్వయంగా తన చేతితోనే నారంగ్ థియేటర్ బిజినెస్​ను నాశనం చేసినట్టు కదా? అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆయన కేవలం ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్​గా మాత్రమే కాదు ఎన్నో దశాబ్దాల నుంచి థియేటర్​ బిజినెస్​లో కూడా తనదైన ముద్ర వేశారు. ఎలాగో ఇప్పుడు.. కరోనా వల్ల నాశనమైన థియేటర్ వ్యవస్థ మళ్లీ మునపటి కళను సంతరించుకుంది. మరి ఇలాంటి సమయంలో నారంగ్ ఎందుకు ఓటీటీ వైపు చూపుతున్నారు?

తన మామా మశ్చీంద్ర సినిమా రిలీజై ఫస్ట్ వీకెండ్​ను కూడా పూర్తి చేసుకోలేదు. మరి అంత త్వరగా ఎందుకు ఓటీటీలో వదులుతున్నారు? అన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి. చూడాలి మరి ఈ ప్రశ్నలకు నారంగ్.. తనని తాను సమర్థించుకుంటారో లేదా ఎలాంటి సమాధానం చెబుతారో.