Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ కు ఆ ఓటీటీతో పనేంటి?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సందీప్ కిషన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

By:  Tupaki Desk   |   3 April 2024 9:38 AM GMT
సందీప్ కిషన్ కు ఆ ఓటీటీతో పనేంటి?
X

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సందీప్ కిషన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఊరు పేరు భైరవకోన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టారు. డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ హారర్ ఫాంటసీ అడ్వెంచర్ అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెప్టెన్ మిల్లర్ లో గెస్ట్ రోల్ లో కనిపించి ప్రశంసలు అందుకున్నారు.

ఇటీవల సూపర్ హిట్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మేకర్స్‌ తో చేతులు కలిపారు సందీప్ కిషన్. స్వరూప్ ఆర్‌ ఎస్‌ జే దర్శకత్వం వహిస్తున్న ఈ వైబ్ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నిర్మిస్తున్నారు. తన మొదటి సినిమాతో ప్రశంసలు అందుకున్న స్వరూప్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. కంటెంట్ బేస్డ్ సినిమాలను తీయడంలో మంచి పేరు సంపాదించిన రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారు.

దీంతోపాటు తమిళ- తెలుగు ద్విభాషా చిత్రం మాయావన్ షూటింగ్‌ ను పూర్తి చేస్తున్నారు సందీప్ కిషన్. 2017 లో వచ్చిన ప్రాజెక్ట్-జెడ్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో కలిసి త్వరలో పని చేయనున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గ్రాండ్ గా నిర్మించనుంది.

ఇప్పుడు వీటితోపాటు తాజాగా ఓ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సందీప్ కిషన్. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కు ఇటీవల టిల్లు స్క్వేర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మల్లిక్ రామ్ దర్శకత్వం వహించనున్నారు. మరికొన్ని నెలల్లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సూపర్ హిట్ ఫ్రాంచైజీ ది ఫ్యామిలీ మ్యాన్ మూడో పార్ట్ లో కూడా సందీప్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ కమాండర్ రోల్ లో యాక్ట్ చేయనున్నారని సమాచారం. ఇక ఊరు పేరు భైరవకోన తర్వాత సందీప్ కిషన్ తన రెమ్యునరేషన్ కూడా పెంచారట. మరి వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ తో సందీప్ కిషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్లు కొడతారో చూడాలి.