Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ పై ఓపెన్ అయిన సందీప్ కిషన్

యంగ్ హీరోలలో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి సందీప్ కిషన్

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:03 AM GMT
ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ పై ఓపెన్ అయిన సందీప్ కిషన్
X

యంగ్ హీరోలలో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి సందీప్ కిషన్. కెరియర్ లో పెద్ద సక్సెస్ రేట్ లేకపోయిన మంచి టాలెంటెడ్ యాక్టర్ అనే ఇమేజ్ మాత్రం సందీప్ కిషన్ కి ఉంది. ఎలాంటి క్యారెక్టర్ ని అయిన పోషించగలడు అనే గుర్తింపుని క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ సారి ఊరు భైరవకలోన సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతానని నమ్మకంతో సందీప్ కిషన్ ఉన్నాడు.

ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాపై కావాల్సినంత హైప్ క్రియేట్ చేశాయి. కచ్చితంగా ఈ మూవీ కూడా విరూపాక్ష తరహాలో బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. మూవీపైన పాజిటివ్ బజ్ ఉంది. మంచి ఓపెనింగ్స్ ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పాడుతున్నారు.

హనుమాన్ తరహాలో పెయిడ్ ప్రీమియర్ షోలు కూడా ఈ చిత్రానికి వేస్తున్నారు. ఇక మూవీ ప్రమోషన్స్ పైన సందీప్ కిషన్ పూర్తిగా ఫోకస్ పెట్టాడు. తాజాగా ఇంటర్వ్యూలో సందీప్ ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చాక ముగ్గురు హీరోయిన్స్ తో డేట్ చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే వారితో బ్రేక్ అప్ అయ్యిందని కూడా క్లారిటీ ఇచ్చాడు. మొదటిసారి నాలుగేళ్లు ఒకరితో డేట్ చేశాను. రెండేళ్లు మరోకరితో డేట్ లో ఉన్నా. మరో రెండేళ్లు ఇంకొకరితో డేట్ చేశా.

ఎవరితో కూడా నా రిలేషన్ నిలబడలేదు. రెజీనాతో నేను రిలేషన్ లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆమె నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. అందరూ అనుకునే రిలేషన్ మాది కాదని సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోయిన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నానని సందీప్ కిషన్ మొదటిసారి ఓపెన్ అయ్యాడు. కానీ వారు ఎవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఊరు పేరు భైరవకోన రిలీజ్ తర్వాత సందీప్ కిషన్ చేస్తోన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.