Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్.. లక్కు మాములుగా లేదు

యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు

By:  Tupaki Desk   |   24 Feb 2024 3:45 AM GMT
సందీప్ కిషన్.. లక్కు మాములుగా లేదు
X

యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత సందీప్ కిషన్ ఖాతాలో మరో బెస్ట్ మూవీగా ఈ సినిమా చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సందీప్ కిషన్ తన నెక్స్ట్ మూవీని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సందీప్ కిషన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. రాజ్ అండ్ డీకే ద్వయంలో వచ్చిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ 1, ఫ్యామిలీ మెన్ 2. ఈ సిరీస్ లో సీజన్ 3 కూడా స్టార్ట్ కాబోతుందంట.

ఫ్యామిలీ 3 వెబ్ సిరీస్ ని త్వరలో పట్టాలు ఎక్కించాలని ఈ దర్శకులిద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. ఫ్యామిలీ మెన్ 2లో సమంత విలన్ గా నటించి మెప్పించింది. ఆమె బోల్డ్ అండ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ కి బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. వారితోనే సమంత సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ చేసింది..

త్వరలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. దీని తర్వాత ఫ్యామిలీ మెన్ 3 స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ లో సందీప్ కిషన్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడు అనేది క్లారిటీ లేదు. సమంత కూడా ఈ సిరీస్ లో ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ సమంత కూడా నటిస్తే కచ్చితంగా ఫ్యామిలీ మెన్ 3కి మంచి హైప్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఊరు పేరు భైరవకోన సినిమాతో సందీప్ కిషన్ మరల తన ఇమేజ్ ని న నిలబెట్టుకున్నాడు. ఇదే స్పీడ్ తో నెక్స్ట్ కూడా డిఫరెంట్ కథలతో మూవీస్ చేస్తూ మార్కెట్ ని ఎంత వరకు పెంచుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఫ్యామిలీ మెన్ 3 వెబ్ సిరీస్ ద్వారా సందీప్ కిషన్ గ్రాండ్ గా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని స్పష్టం అవుతోంది.