Begin typing your search above and press return to search.

నా సినిమా నాకే నచ్చలేదు : సందీప్ కిషన్

టాలీవుడ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ విభిన్న తరహా పాత్రలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు

By:  Tupaki Desk   |   8 Feb 2024 1:17 PM GMT
నా సినిమా నాకే నచ్చలేదు : సందీప్ కిషన్
X

టాలీవుడ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ విభిన్న తరహా పాత్రలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేసే నటుల్లో సందీప్ కిషన్ ఒకరు. ఈ హీరో త్వరలోనే 'ఊరు పేరు భైరవకోన' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 16న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. హీరో సందీప్ కిషన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో తాను నటించిన 'మైఖేల్' మూవీ ఫెయిల్యూర్ పై స్పందించాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ మాట్లాడుతూ.." నిజమే 'మైఖేల్' సినిమా థియేటర్స్ లో సరిగా ఆడలేదు. మూవీ రెవెన్యూ గురించి పక్కన పెడితే సినిమా ఫైనల్ అవుట్ పుట్ నాకే నచ్చలేదు. అదే విషయాన్ని డైరెక్టర్ కి కూడా చెప్పా. మా దగ్గర సాలిడ్ ఫుటేజ్ ఉంది. సో ఎడిటింగ్ విషయంలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఉంటే మైఖేల్ ఫెంటాస్టిక్ ఫిలిం అయ్యేది.

కానీ ఎక్కడో దాని గురించి మిస్టేక్ జరిగింది. మైకేల్ మూవీ ని ముగ్గురు నిర్మాతలు నిర్మించారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇద్దరు నిర్మాతలు అన్నారు. కానీ ఓ నిర్మాత సినిమా సరిగ్గా రాలేదని అన్నారు. విడుదలకు 12 రోజుల ముందు తన అభిప్రాయాన్ని చెప్పాడు. అప్పుడు విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో నేను మళ్ళీ అవుట్ ఫుట్ ని రీ చెక్ చేయలేదు.

ఎందుకంటే సరిగ్గా రిలీజ్ టైం లో అలాంటి ప్రెజర్ ని హ్యాండిల్ చేసేందుకు నేను రెడీగా లేను. రిలీజ్ కు ఒక్క రోజు ముందు సినిమా చూసినప్పుడు బాలేదని అర్థమైంది. మైఖేల్ కి సంబంధించి మొదట్లో కొన్ని ఎపిసోడ్స్ చూసి కచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని భావించాను. అయితే సినిమా మొత్తం చూసినప్పుడు ఈ ఎపిసోడ్స్ మాత్రమే కాదు కథ మొత్తం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూడాలి.

టెక్నికల్ పరంగా మైఖేల్ ఒక ఎక్స్ ట్రార్డినరీ ఫిలిం. మేం కూడా సినిమాపై సాలిడ్ టెక్నికల్ ఎఫెక్ట్స్ పెట్టాం. అదే సమయంలో కథ పై కాన్సెంట్రేట్ చేయలేదు. మేము అనుకున్న కథ ఆడియన్స్ కి చెప్పలేకపోయాం. సో మైఖేల్ రిజల్ట్ నాకు ముందే తెలుసు కాబట్టి అది నాకు చాలా కష్టంగా అనిపించింది" అని అన్నాడు.