Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్.. అనుకున్నట్లే ధమాకా కాంబో!

తాజాగా సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ధమాకా మూవీ దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో సినిమా చేయనున్నట్లు వస్తున్న వార్తలు నిజమయ్యాయి.

By:  Tupaki Desk   |   12 March 2024 7:58 AM GMT
సందీప్ కిషన్.. అనుకున్నట్లే ధమాకా కాంబో!
X

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ఇటీవల ఊరు పేరు భైరవకోన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ కుర్ర హీరోకి లేటెస్ట్ గా దక్కింది. వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా.. థియేటర్లు మాత్రం హౌస్ ఫుల్ అయ్యాయి. వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా అదరగొడుతోంది.

అయితే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేసే సందీప్ కిషన్.. ఇటు టాలీవుడ్ తో పాటు మిగతా భాషల చిత్రాల్లో క్యామియో రోల్స్ చేస్తున్నారు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ లో తన నటనతో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మంచి లైనప్ ను సెట్ చేసుకున్నారు. మాయావన్-2 సినిమా షూటింగ్‌ ను పూర్తి చేస్తున్నారు. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.

తాజాగా సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ధమాకా మూవీ దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో సినిమా చేయనున్నట్లు వస్తున్న వార్తలు నిజమయ్యాయి. సందీప్ కిషన్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం వచ్చింది. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్ల తర్వాత హ్యాట్రిక్ హిట్‌ సాధించడానికి ఈ రెండు ప్రొడక్షన్ హౌస్‌ లు మళ్లీ జతకట్టాయి. ఇక త్రినాధ రావు నక్కిన, ప్రసన్న కుమార్ బెజవాడది సక్సెస్ కాంబోనే. ఇప్పటికే వీరిద్దరు కలిసి ధమాకా సహా అనేక బ్లాక్‌ బస్టర్‌ లను అందించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న SK30కి ప్రసన్న కుమార్ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌ లను అందించనున్నారు.

విభిన్నమైన కాన్సెప్టులతో అలరించే సందీప్ కిషన్ తన ల్యాండ్ మార్క్ మూవీలో నెవ్వర్ బిఫోర్ పాత్రలో కనిపించనున్నారు. హైక్వాలిటీ ప్రొడక్షన్, టెక్నాలజీ తో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్న మార్క్ ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.