ఆ సర్జరీతో ఫేస్ మారుతుందని భయపడుతున్న యంగ్ హీరో
కష్టసుఖాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు వీటికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ అతీతులు కాదు.
By: Tupaki Desk | 10 July 2025 6:00 PM ISTకష్టసుఖాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు వీటికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ అతీతులు కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీలు తమ సమస్యలను బయటపడి చెప్తే మరికొందరు మాత్రం చెప్పకుండా దాచేస్తారు. సోషల్ మీడియా వాడకం పెరిగాక సెలబ్రిటీలు కూడా ప్రతీదీ తమ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్న సెలబ్రిటీలు చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఇప్పుడు అలాంటి ఓ సమస్యతోనే బాధపడుతున్నారట. తెలుగుతో పాటూ తమిళ ఇండస్ట్రీలో కూడా హీరోగా రాణిస్తున్న సందీప్ కిషన్ ఓ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.
మొన్నా మధ్య ఓ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సందీప్ తనకున్న సమస్య గురించి బయటపెట్టారు. సందీప్ సైనస్ తో బాధపడుతున్నారట. సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు బ్రేక్ దొరికితే కారావ్యాన్ లోకి వెళ్లి నిద్రపోతానని, అలా పడుకున్నప్పుడు తన ముక్కు నుంచి వెనుక పార్ట్ వరకు మొత్తం బ్లాక్ అవుతుందని, ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేవగానే కూడా ఇదే సమస్య అని సందీప్ వెల్లడించారు.
అందుకే ఉదయం లేవగానే అమ్మానాన్నతో కూడా మాట్లాడకుండా వేడిగా టీ తాగి, మెడిటేషన్ మ్యూజిక్ తో పాటూ స్తోత్రాలు విని ఆ తర్వాతే ఎవరితోనైనా మాట్లాడతానని తెలిపారు సందీప్. అయితే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడటానికి సర్జరీ చేయించుకోవాలని, కానీ ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు, ముఖం మారిపోతుందని భయమేసి చేయించుకోవడం లేదని సందీప్ తెలిపారు. దాంతో పాటూ సర్జరీ తర్వాత నెల రోజుల పాటూ షూటింగ్స్ ఏమీ లేకుండా ఉండాలని, ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడాలని అందుకే తనకు సర్జరీ అంటే భయమని సందీప్ పేర్కొన్నారు.
