Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరో ఇంట విషాదం

ఈ ఏడాది ఆరంభంలో మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్‌ కిషన్‌ త్వరలో మరో సినిమాతో రాబోతున్నాడు.

By:  Tupaki Desk   |   18 Jun 2025 3:14 PM IST
యంగ్‌ హీరో ఇంట విషాదం
X

హీరో సందీప్‌ కిషన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన నానమ్మ శ్రీపాదం ఆగ్నేసమ్మ మృతి చెందారు. వైజాగ్‌లో నివాసం ఉండే ఆమె చుట్టు పక్కల వారికి సుపరిచితురాలు. రిటైర్డ్‌ ప్రభుత్వ టీచర్ అయిన ఆగ్నేసమ్మ ఎంతో మంది పేద విద్యార్థులకు సొంత ఖర్చుతో విద్యా బుద్దులు నేర్పించారట. స్థానికంగా ఆమె గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీపాదం ఆగ్నేసమ్మ అనే పేరు వైజాగ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మందికి తెలుసు. ఆమె మృతి విషయం తెలిసి ఎంతో మంది ఆమె విద్యార్థిని విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

నానమ్మ చనిపోయిన విషయం తెలిసి చెన్నై నుంచి వెంటనే తన స్వస్థలానికి హీరో సందీప్ కిషన్ చేరుకున్నాడు. ఆయనతో పాటు మేనమామ చోటా కే నాయుడు సైతం ఉన్నాడు. మంగళవారం చోటా కే నాయుడుతో కలిసి సందీప్‌ కిషన్‌ తన నానమ్మ ఆగ్నేసమ్మ అంతిమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక చర్చ్‌లో ఆమె మృతదేహంను ఖననం చేశారు. నానమ్మ పాడె మోసిన సందీప్‌ కిషన్‌ ఫోటోలు స్థానిక మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆగ్నేసమ్మ పెద్ద కుమారుడు రవి తనయుడు ఈ సందీప్ కిషన్‌. మనవడిగా తన బాధ్యతలను నిర్వహించేందుకు గాను సందీప్‌ కిషన్‌ వైజాగ్‌ చేరుకున్నాడని బందుమిత్రులు చెప్పుకొచ్చారు.

సందీప్‌ కిషన్ చిన్న వయసులోనే వైజాగ్‌ వదిలి చెన్నై వెళ్లాడు. అయినప్పటికీ చిన్నప్పుడు తిరిగిన సెయింట్‌ పీటర్స్ చర్చ్‌ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు అంటూ స్థానికులు చెప్పుకొచ్చారు. సన్నిహితులు, బంధుమిత్రులతో కొన్ని గంటల సమయం గడిపి, నానమ్మ చివరి తంతును పూర్తి చేసి సందీప్‌ కిషన్ తన మామ చోట కే నాయుడు తో కలిసి తిరిగి చెన్నై చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన రాక నేపథ్యంలో వైజాగ్‌ స్థానిక మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి.

ఈ ఏడాది ఆరంభంలో మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్‌ కిషన్‌ త్వరలో మరో సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా కూడా ఇదే ఏడాదిలో విడుదల కానున్నట్లు సమాచారం అందుతోంది. వైబ్‌ అనే టైటిల్‌తో ఆ సినిమా రూపొందుతోంది. సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌ల్లోనూ సందీప్‌ కిషన్ నటిస్తూ ఉన్నాడు. ఇప్పటికి రెండు వెబ్‌ సిరీస్‌ల్లో నటించిన సందీప్ కిషన్ మరో వెబ్‌ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే తమిళ్‌లో కొత్త సినిమాకు సందీప్‌ కిషన్ సైన్‌ చేయబోతున్నాడు.