Begin typing your search above and press return to search.

'సుందరం మాస్టర్' ట్రైలర్: ఆ ఊర్లో పరీక్షల్లో ఫెయిలైతే ఉరి తీస్తారట!

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:30 PM GMT
సుందరం మాస్టర్ ట్రైలర్: ఆ ఊర్లో పరీక్షల్లో ఫెయిలైతే ఉరి తీస్తారట!
X

కమెడియన్ హ‌ర్ష చెముడు (వైవా హర్ష) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సుందరం మాస్టర్’. మాస్ మహారాజ్ రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తెలుగమ్మాయి దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడీ సినిమా ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి భాగమయ్యాయి. తన చేతుల మీదుగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు.

‘సుందరం మాస్టర్’ ట్రైలర్ లాంచ్ చేసిన చిరు, ఇది హర్షకు ట్రెయిలర్ మేడ్ క్యారెక్టర్ అని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. తనను ఎవరూ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తే ఇక్కడి దాకా రాలేదు.. తన టాలెంట్ తో తనుకు తానుగా ఈరోజు హీరో స్థాయికి వచ్చాడని అన్నారు. ఎమోషన్స్ కలబోసి ఎంతో ఎంటర్టైనింగ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలను తెలుగు ఆడియెన్స్ కచ్ఛితంగా ఆదరిస్తారని, ఇది హర్ష కు పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ జనరేషన్ లో నేను ఎలాగో, ఈ జనరేషన్ లో హర్ష కూడా ఎలాంటి అండదండలు లేకుండా పైకి వచ్చినవారమే అని చిరంజీవి అన్నారు. ఈ సంధర్భంగా హర్ష భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇక 'సుందరం మాస్టర్' ట్రైలర్ విషయానికొస్తే.. సుందర్ రావు అనే టీచర్, అటవీ ప్రాంతంలోని మిర్యాలమిట్ట అనే ఓ మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అయితే అక్కడ జనాలందరూ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం చూసి అవాక్కవుతాడు. అక్కడి నుంచి ఎలాగైనా బయట పడాలనుకున్న సుందరానికి, ఆ ఊర్లో ఏదో విలువైనది ఉందని తెలుస్తుంది. అదేంటో తెలుసుకోవాలని ట్రై చేస్తుండగా.. ఆ గ్రామంలో ఎగ్జామ్ ఫెయిల్ అయిన వారిని ఉరి తీస్తారని తెలిసి షాక్ అవుతాడు. పరీక్షల్లో ఫెయిలైతే ఉరి తీయడానికి కారణమేంటి? అక్కడ ఉన్న విలువైన వస్తువు ఏంటి? అసలు ఆ ఊర్లో ఏం జరుగుతోంది? ఊర్లోని జనాలు అంత బాగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు? సుందరం మాస్టర్ కథకు ముగింపు ఏంటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో ఇదొక కామెడీ సినిమా అని భావిస్తుండగా.. ఇందులో చిన్న కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. కేవలం కామెడీనే కాదు ఎమోషన్స్ కూడా ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్లుగా విజువల్స్ ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ''యువర్ మదర్ అంటే పిలుపంటరు.. నీ అమ్మ అంటే బూతంటరు.. ఈ కిటుకంతా భాషలోనే ఉంది" లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

ఇన్నాళ్లూ కమెడియన్ గా తన హాస్యంతో అందరినీ నవ్వించిన హర్ష చెముడు.. ఈసారి లీడ్ రోల్ లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎప్పటిలాగే అతని గెటప్, హావభావాలు నవ్వు తెప్పిస్తాయి. గిరిజన యువతిగా డీ గ్లామర్ లుక్ లో కనిపించింది దివ్య శ్రీపాద. హర్ష వర్ధన్, భద్రం మినహా ఈ ట్రైలర్ లో తెలిసిన ముఖాలేవీ కనిపించలేదు. ఓవరాల్ గా 'సుందరం మాస్టర్' ట్రైలర్ ఫన్నీగా ఉండటంతో పాటుగా థ్రిల్ కు గురి చేస్తూ, ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని చెప్పాలి.

RT టీమ్ వర్క్స్ & గోల్డెన్ డెన్ మీడియా బ్యానర్‌పై రవితేజ - సుధీర్ కుమార్ కుర్రు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చగా, దీపక్ ఎంటాల సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఉన్నవ కార్తీక్ ఎడిటింగ్ చేయగా, చంద్రమౌళి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. 'సుందరం మాస్టర్' సినిమా ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. వైవిద్యమైన కంటెంట్ తో రాబోతున్న ఈ చిత్రం.. హర్ష, రవితేజలకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.