Begin typing your search above and press return to search.

అస‌భ్య‌త గురించి డైరెక్ట‌ర్ కామెంట్స్.. నెట్టింట వైర‌ల్

ఓ వైపు న‌టుడిగా ఉంటూనే మ‌రోవైపు డైరెక్ట‌ర్ గా సినిమాలు చేస్తూ త‌న‌దైన శైలిలో దూసుకెళ్తున్న సుంద‌ర్ నుంచి ఇప్ప‌టికే ఎన్నో సినిమాలొచ్చాయి.

By:  Tupaki Desk   |   21 April 2025 8:30 PM
Sundar C Comments On Vulgarity
X

త‌మిళ డైరెక్ట‌ర్ల‌లో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుంద‌ర్ సి. ఓ వైపు న‌టుడిగా ఉంటూనే మ‌రోవైపు డైరెక్ట‌ర్ గా సినిమాలు చేస్తూ త‌న‌దైన శైలిలో దూసుకెళ్తున్న సుంద‌ర్ నుంచి ఇప్ప‌టికే ఎన్నో సినిమాలొచ్చాయి. మ‌ద గ‌ద రాజా స‌క్సెస్ త‌ర్వాత సుంద‌ర్ ఇప్పుడు గ్యాంగ‌ర్స్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో సుంద‌ర్ తో పాటూ వ‌డివేలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

ఏప్రిల్ 24న గ్యాంగ‌ర్స్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ కు ఎన్నో రోజులు లేక‌పోవ‌డంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేసింది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా సుంద‌ర్ వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సినిమాను తెగ ప్ర‌మోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఓ ఇంట‌ర్వ్యూలో సుంద‌ర్ త‌న సినిమాల్లోని కంటెంట్ గురించి మ‌రియు త‌న సినిమాల్లో ఉండే అస‌భ్య‌త గురించి చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి.

మీ సినిమాల్లో అవ‌స‌రానికి మించిన గ్లామ‌ర్ ఉంటుంద‌ని ఎప్పుడూ విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయ‌ని యాంక‌ర్ సుంద‌ర్ ను ప్ర‌శ్నించ‌గా, దానిపై సుంద‌ర్ మాట్లాడారు. త‌న సినిమాల్లో హీరోయిన్లను తెర‌పై మ‌రింత‌ అందంగా చూపించాల‌ని కోరుకుంటాన‌ని, గ్లామ‌ర్ సాంగ్స్ కోసం తానెప్పుడూ అవ‌స‌రం లేని సీన్స్ ను త‌న సినిమాలో పెట్ట‌న‌ని చెప్పిన సుంద‌ర్, త‌న సినిమాల్లో ర‌క్త‌పాతాలు, హింస‌లు ఉండ‌వ‌ని కూడా వెల్ల‌డించారు.

తాను స్క్రిప్ట్ రాసుకునేట‌ప్పుడే మెయిన్ క్యాస్టింగ్ తో కానీ మ‌రెవ‌రితోనైనా కానీ డ‌బుల్ మీనింగ్స్ డైలాగ్స్ చెప్పించ‌కూడ‌ద‌ని, క‌థ‌తో, సినిమాతో సంబంధం లేని హీరోయిన్ ల‌తో స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌కూడ‌ద‌ని తాను టార్గెట్ గా పెట్టుకున్నాన‌ని, త‌న సినిమాలు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా చూస్తారు కాబ‌ట్టి అందులో ఎలాంటి రేప్ సీన్స్, ఇబ్బంది ప‌డే స‌న్నివేశాల‌ను పెట్టకూడ‌ద‌ని డిసైడ్ అయిన‌ట్టు సుంద‌ర్ తెలిపారు.

సుంద‌ర్ ఈ కామెంట్స్ చేశాక అత‌న్ని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. సుంద‌ర్ నుంచి ఆఖ‌రిగా వ‌చ్చిన మ‌ద గ‌జ రాజా సినిమాలో స‌దా ఐటెం సాంగ్ చేసింద‌ని, ఆ సినిమా మెయిన్ క్యాస్టింగ్ లో స‌దా లేద‌ని, కేవ‌లం సాంగ్ లో మాత్రమే స‌దా క‌నిపించింద‌ని కామెంట్స్ చేస్తుండ‌గా, మ‌రికొంద‌రు త‌న సినిమాల‌ను ఫ్యామిలీస్ తో చూస్తార‌ని ఆయ‌నే అంటూ అందులో ఐటెం సాంగ్స్ ఎలా పెట్టార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. సుంద‌ర్ చెప్పేదొక‌టి చేసేదొక‌ట‌ని అంద‌రూ ఆయ‌న్ని విమ‌ర్శిస్తున్నారు. మ‌రి ఈ కామెంట్స్ పై ఆయ‌నెలా రెస్పాండ్ అవుతారో చూడాలి.