Begin typing your search above and press return to search.

సుందర్ ను హార్ట్ చేసిన హీరో ఎవరు?

డైరెక్టర్ సుందర్ గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.

By:  Tupaki Desk   |   21 April 2025 12:01 PM
Sundar C’s Cryptic Comments Stir Buzz
X

డైరెక్టర్ సుందర్ గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. రీసెంట్ గా స్టార్ హీరో విశాల్ తో తీసిన మద గజ రాజాతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు గ్యాంగ్సర్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాలో వడివేలుతోపాటు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

అయితే గ్యాంగర్స్ మూవీ ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు సుందర్. పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఒక కోలీవుడ్ హీరో గురించి చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఓ హీరో వైఖరి గురించి ప్రస్తావించారు. సదరు హీరోకు ఎలాంటి మార్కెట్ లేని సమయంలో తాను ఒక సినిమా చేశానని తెలిపారు. దర్శకత్వం వహించానని చెప్పారు. ఆ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందని, హిట్ కూడా అయిందని గుర్తు చేసుకున్నారు.

అయితే ఆ మూవీ హిట్ తర్వాత మళ్లీ ఆ హీరోతో మరో సినిమా చేశానని తెలిపారు సుందర్. కానీ సదరు నటుడిలో చాలా ఛేంజ్ ను గమనించానని వెల్లడించారు. తన మార్కెట్ విలువ పెరిగిన తర్వాత ఆ హీరో ప్రతి సీన్ విషయంలో కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తాడని అన్నారు. దీంతో ఆ మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ కోల్పోయానని చెప్పారు సుందర్.

ఇప్పుడు సుందర్ కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ఎవరికోసం మాట్లాడి ఉంటారోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అర్జున్ అయ్యి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. 2004లో సుందర్, అర్జున్ కలిసి గిరి మూవీ చేశారు. ఆ తర్వాత 2005లో చిన్నా మూవీ కోసం మరోసారి ఇద్దరు చేతులు కలిపారు.

సిద్ధార్థ్ కావొచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. సుందర్ తో ఆయన చేసిన తీయా వేలై సెయ్యనుమ్ కుమారు మూవీకి ముందు సిద్ధార్థ్ కు ఎలాంటి మార్కెట్ లేదు. ఆ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత అరణ్మైనై-2 గాను సిద్దార్థ్, సుందర్ మళ్లీ పనిచేశారు. విన్నర్, లండన్ సినిమాల్లో నటించిన ప్రశాంత్ కూడా కావొచ్చని ఇంకొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఆ నటుడు పేరును సుందర్ చెప్పకపోవడం ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని అంతా ఆసక్తి చూపిస్తున్నారు.