తండ్రి కూతుళ్లకు క్యాన్సర్.. అన్నకు పెద్ద రుగ్మత.. స్టార్ ఫ్యామిలీలో కల్లోలం!
తండ్రి కూతుళ్ల అనుబంధం, భావోద్వేగాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
By: Tupaki Desk | 28 April 2025 4:23 AMతండ్రి కూతుళ్ల అనుబంధం, భావోద్వేగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయసులోనే ప్రేమలో పడిన స్టార్ ప్రొడ్యూసర్ కుమార్తె, స్టార్ హీరో సోదరి ఆమె. చాలా చిన్న వయసులోనే వ్యసనాలకు గురైంది. మద్యం రోజంతా తాగుతూ మత్తులో జోగేది. దాంతో ఆరోగ్యం చెడిపోయింది. తీవ్రమైన క్యాన్సర్, ఫ్యాటీ లవర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కొంది. అయితే కళ్ల ముందే కూతురు ఇలా అనారోగ్యాల భారిన పడి ఆవేదన చెందుతుంటే, దానిని తన తండ్రి తట్టుకోలేక ఏడ్చేసారట. మొదటిసారి తనకు గర్భధారణ అని తెలిశాక తన తండ్రి ఎంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ తనకు అనారోగ్యం అని తెలిస్తే చాలు బాధతో ఏడ్చేస్తాడు. తీవ్రంగా కలతకు గురవుతాడు. ఒకేసారి ముగ్గురు డాక్టర్లకు ఫోన్ చేస్తాడు.
అంత గొప్ప ప్రేమానుబంధాలు ఈ తండ్రి కూతుళ్ల నడుమ ఉన్నాయి. అయితే తన తండ్రికి క్యాన్సర్ ఉందని తెలియగానే తన కాళ్ల కింద భూమి కుంగిపోయిందనే భావన కలిగిందని ఆ కుమార్తె తనలోని బాధను వ్యక్తం చేసింది. తనకు క్యాన్సర్ ఉందని, అనారోగ్యాలు ఉన్నాయనే దానికంటే తన తండ్రికి క్యాన్సర్ అని తెలియగానే తీవ్రంగా కుంగిపోయానని వెల్లడించింది. తన తండ్రితో తన అనుబంధం చాలా గొప్పది. తాను అల్లారుముద్దుగా గారాబంగా పెరిగానని అందరూ అనుకుంటారు కానీ, అంతకుమించి చాలా సమస్యలతో కష్టాలను ఎదుర్కొన్నానని చెప్పింది.
అయితే ఈ కథ అంతా ఎవరి గురించి? అంటే.. పాపులర్ బాలీవుడ్ నిర్మాత రాకేష్ రోషన్.. అతడి కుమార్తె సునైనా రోషన్ గురించిన కథ ఇది. సునైనా గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కి సోదరి. తన తండ్రి, సోదరులతో సునైన ఎంతగానో కనెక్ట్ అయి ఉంది. తన సోదరుడు హృతిక్ రోషన్ కి దీర్ఘకాలిక సబ్‌డ్యూరల్ హెమటోమాతో బాధపడుతున్నాడని తెలిసి ఎంతో కలతకు గురయ్యానని కూడా సునైనా తెలిపింది. ఒకానొక సమయంలో సునైనా ఒక పాకిస్తానీ యువకుడిని ప్రేమించడంతో తన అన్న, తండ్రి తనను కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కథనాలొచ్చాయి. అదంతా వేరే కథ.