Begin typing your search above and press return to search.

టైర్ 2 హీరోలకి సమ్మర్ బోనాంజా

సమ్మర్ సీజన్ లో పెద్ద హీరోలు తమ సినిమాలని రిలీజ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

By:  Tupaki Desk   |   18 March 2024 5:11 AM GMT
టైర్ 2 హీరోలకి సమ్మర్ బోనాంజా
X

సమ్మర్ సీజన్ లో పెద్ద హీరోలు తమ సినిమాలని రిలీజ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం పెద్ద హీరోల చిత్రాలు ఏవీ కూడా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వచ్చేలా కనిపించడం లేదు. మే నెలలో కల్కి రిలీజ్ ఎనౌన్స్ చేశారు. అయితే ఎలక్షన్స్ ఇంపాక్ట్ కారణంగా ఈ మూవీ వాయిదా పడబోతోంది. జూన్ లేదా ఆగష్టులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఈ సారి తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలైన కూడా ఓటింగ్ మే నెలలో జరగనుంది. జూన్ లో రిజల్ట్ రానుంది. దీంతో మార్చి, ఏప్రిల్ లో కావాల్సినంత టైం సినిమాలకి ఉంది. రేసులో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో టైర్ 2 హీరోల చిత్రాలతో పాటు, మీడియం హీరోలకి కూడా ఈ మూడు నెలలు తమ సినిమాలు రిలీజ్ చేసుకొని సక్సెస్ అందుకోవడానికి ఛాన్స్ ఉంది.

నలుగురు యంగ్ హీరోలు ఈ సమ్మర్ లో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ నలుగురు కూడా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్ కావడం విశేషం. మార్చి 29న సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ట్రైలర్ తోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీకి అదనపు అస్సెట్ అని చెప్పొచ్చు. సక్సెస్ అయితే రెండు వారాల పాటు సినిమాకి ఎలాంటి డోకా ఉండదు.

ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లోకి రాబోతోంది. గీతాగోవిందం తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ చేస్తోన్న సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అన్ని ఎమోషన్స్ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. కచ్చితంగా ఏప్రిల్ నెలలో సెలవులని బాగా వినియోగించుకోవడానికి విజయ్ దేవరకొండ టీమ్ కి మంచి ఛాన్స్ దొరికింది. మే నెల వరకు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లైన్ లో లేవు కాబట్టి ఫ్యామిలీ స్టార్ దీన్ని బాగా వాడుకోవచ్చు.

ఇక విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రీరిలీజ్ డేట్ మే 19కి ఫిక్స్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరుగుతాయి. మే 19న కరెక్ట్ ప్లానింగ్ తో రిలీజ్ డేట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పెట్టుకున్నారు. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం లాంగ్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ సాధించడానికి కావాల్సినంత స్కోప్ ఈ చిత్రానికి ఉంది. రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో సిద్ధం అవుతోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీ జూన్ 24న రిలీజ్ కానుంది. మూవీపైన హైప్ ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసి సక్సెస్ అందుకుంటే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఈ మూవీకి ఉంది.