Begin typing your search above and press return to search.

సమ్మర్ హిట్ ఖాతా తెరిచారు..!

సినిమా సక్సెస్ ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   23 March 2024 12:40 PM GMT
సమ్మర్ హిట్ ఖాతా తెరిచారు..!
X

శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్ లో హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. వి సెల్యులాయిడ్ బ్యానర్ లో వి సెల్యులాయిడ్ తో పాటుగా సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు. సినిమాలో ప్రీతి ముకుంధన్, అయేషా ఖాన్ ఫిమేల్ లీడ్ గా నటించారు. రిలీజ్ ముందు ప్రచార చిత్రాలతోనే బజ్ తెచ్చుకున్న ఓం భీం బుష్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా కూడా సూపర్ గా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. సినిమా సక్సెస్ ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని ఆడియన్స్ కి చెప్పడం ఒక సాహసమే అని అన్నారు. ఈ సినిమా సక్సెస్ తో సమ్మర్ బోణీ కొట్టారని. సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారని చెబుతున్నారు. సినిమా తో సక్సెస్ అందుకున్న వారందరికీ కంగ్రాట్స్ చెప్పారు దిల్ రాజు. ఎక్సామ్స్ పూర్తవుతున్న ఈ టైం లో ఈ సినిమాను మిగతా వారంతా చూసి మరింత సక్సెస్ చేయాలని చెప్పారు.

సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. కష్టే ఫలి అని అందరు అంటుంటారు కదా సినిమా కోసం రెండున్నర ఏళ్లుగా మమ్మల్ని కష్ట పెట్టి డైరెక్టర్ హర్ష ఫలితాన్ని పొందాడని అన్నారు. కష్టాలు పడటంలో కూడా చిన్న ఆనందం ఉంటుంది. ఆ ఆనందం స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మిగతా వాళ్లంతా ఆనంద భాష్పాలతో నవ్వుతున్నందుకు మేము ఆనంద పడుతున్నాం. మాకు వచ్చేది కన్నీళ్లే కానీ ఆ కన్నీళ్లు ఎవరికీ కనిపించకూడదని ఇలా స్పెడ్స్ పెట్టుకున్నానని అన్నారు రాహుల్ రామకృష్ణ. ఈ సినిమాను ఆదరించినందుకు అందరికీ థాంక్స్ అని అన్నారు.

లాస్ట్ ఇయర్ సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు ఓం భీం బుష్ తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. హర్ష డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.