చిన్ననాటి జ్ఞాపకాలు.. స్నేహం, సందడితో ‘సమ్మర్ హాలిడేస్’ ట్రైలర్!
ట్రైలర్‌లో ఇద్దరు పిల్లల జీవితాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. మాస్టర్ అరుణ్‌దేవ్ పొతులా నటించిన ఆర్‌వీ చదువుల్లో మంచి ర్యాంకులు సాధించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటాడు.
By: Tupaki Desk | 28 Oct 2026 8:31 PM ISTచిన్నప్పుడు గడిపిన వేసవి సెలవులు, స్నేహితులతో చేసిన అల్లరి, స్కూల్‌లో సరదాలు.. ఇలాంటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ‘సమ్మర్ హాలిడేస్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మించారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
ట్రైలర్‌లో ఇద్దరు పిల్లల జీవితాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. మాస్టర్ అరుణ్‌దేవ్ పొతులా నటించిన ఆర్‌వీ చదువుల్లో మంచి ర్యాంకులు సాధించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటాడు. తండ్రి పాత్రలో హర్షవర్ధన్ చదువులపై దృష్టి పెట్టాలని కోరుకుంటే, తల్లి పాత్రలో వాసుకి ఆనంద్ అతడి ఇష్టాలకు అండగా నిలుస్తారు. క్రికెట్‌పై ఆర్‌వీకి ఉన్న ఆసక్తి కూడా కథలో భాగంగా కనిపిస్తుంది.
మరోవైపు మాస్టర్ రోహన్ నటించిన కేవీ గ్రామీణ వాతావరణంలో స్వేచ్ఛగా, సరదాగా పెరుగుతుంటాడు. అతడి స్కూల్ అల్లరి, సుమతి పాత్రలో నటించిన బేబీ ఖుషిపై ఇష్టం వంటి సన్నివేశాలు నవ్వులు పంచేలా ఉన్నాయి. చిరంజీవి ప్రస్తావన కూడా ట్రైలర్‌లో సరదాగా కనిపిస్తుంది.
భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన ఆర్‌వీ, కేవీల మధ్య స్నేహం ఎలా మొదలైంది? వారి ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలేంటి? అనే ఆసక్తిని ట్రైలర్ కలిగిస్తోంది. పిల్లలపై చదువుల ఒత్తిడి, వారి అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం వంటి అంశాలను కూడా ఈ సినిమా స్పృశిస్తున్నట్లు తెలుస్తోంది. జయసుధ అమ్మమ్మ పాత్రలో, రాజీవ్ కనకాల కీలక పాత్రలో కనిపించనున్నారు.
సింజిత్ యెర్రమిల్లి సంగీతం, ఆహ్లాదకరమైన విజువల్స్, నవ్వులు పంచే సన్నివేశాలతో ‘సమ్మర్ హాలిడేస్’ కుటుంబమంతా కలిసి చూసే సినిమాలా కనిపిస్తోంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రాల తర్వాత ధీరజ్ మొగిలినేని మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దర్శకుడు శ్రీకర్ నయన్ జీ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది.
