పవన్ రాడు.. మరి వచ్చేదెవరు?
కానీ ఈ నెలకు కూడా ఆశించిన ఆరంభం దక్కలేదు. గురువారం రిలీజైన ‘థగ్ లైఫ్’ బ్యాడ్ టాక్ తెచ్చుకుంది.
By: Tupaki Desk | 8 Jun 2025 10:09 AM ISTఈ ఏడాది సమ్మర్ సీజన్ ప్రేక్షకులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ‘హిట్-3’, ‘సింగిల్’ మినహా సమ్మర్ సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. ఈ రెండు చిత్రాలకు ముందు, తర్వాత బాక్సాఫీస్ వెలవెలబోయింది. గత కొన్ని వారాల నుంచి బాక్సాఫీస్ స్లంప్ చూస్తోంది. ఐతే మే నెల దెబ్బ కొట్టినా.. జూన్ నెల ఆశలు రేకెత్తించింది. ఈ నెలలో ప్రతి వారానికీ ఒక క్రేజీ సినిమా షెడ్యూల్ కావడంతో బాక్సాఫీస్‌కు మళ్లీ కళ వస్తుందనే ఆశించారంతా.
కానీ ఈ నెలకు కూడా ఆశించిన ఆరంభం దక్కలేదు. గురువారం రిలీజైన ‘థగ్ లైఫ్’ బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్లోనే ఈ సినిమా నిలబడలేకపోతోంది. ఇక వారాంతం గడిచాక బాక్సాఫీస్ మళ్లీ కళ తప్పడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి వచ్చే వారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కావాల్సింది. కమల్ సినిమా తేడా కొట్టిన నేపథ్యంలో పవన్ చిత్రం వస్తే వసూళ్ల మోత మోగేది. కానీ ఈ అడ్వాంటేజ్‌ను ఆ సినిమా ఉపయోగించుకోలేకపోయింది.
‘హరిహర వీరమల్లు’ రిలీజ్ వాయిదా పడ్డ నేపథ్యంలో వచ్చే వారాంతాన్ని ఉపయోగించుకునేది ఎవరన్నది ప్రశ్నార్థకం. ప్రస్తుతానికి ఈ వారానికి ఏ సినిమా షెడ్యూల్ కాలేదు. తర్వాతి వారంలో ‘కుబేర’ రాబోతోంది. ఆ తర్వాత వరుసగా కన్నప్ప, కింగ్‌డమ్ చిత్రాలు వస్తాయి. దగ్గర్లో రిలీజ్‌కు రెడీగా ఉన్న కాస్త పేరున్న సినిమాలేవీ కనిపించడం లేదు.
అలాంటి సినిమా ఏదైనా ఉంటే.. వచ్చే వారం రిలీజ్ చేస్తే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇప్పటిదాకా మరే చిత్రానికీ ఈ డేట్‌ను ఎంచుకోని నేపథ్యంలో వచ్చే వారం బాక్సాఫీస్ ఖాళీగా మారబోతోంది. పవన్ సినిమా రాదని పది రోజుల ముందు నుంచే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏదో ఒక సినిమాను ఆ వారానికి రెడీగా పెట్టుకుని ఉండాల్సింది. కానీ అలా చేయకపోవడంతో మంచి అవకాశాన్ని మిస్సవుతున్నట్లే.