Begin typing your search above and press return to search.

యూత్ టార్గెట్‌ గా సన్నాఫ్ సుమ మూవీ

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో రోషన్‌ కనకాల మొదటి మూవీ రూపొందుతోంది.

By:  Tupaki Desk   |   3 Oct 2023 8:07 AM GMT
యూత్ టార్గెట్‌ గా సన్నాఫ్ సుమ మూవీ
X

యాంకర్‌ గా సుమ సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్న విషయం తెల్సిందే. ఇక రాజీవ్ కనకాల నటుడిగా సినీ ప్రేమికులను, ప్రేక్షకులను తనదైన నటనతో వినోదాన్ని పంచుతూ అలరిస్తూ ఉన్నాడు. వీరిద్దరి తనయుడు రోషన్‌ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కొన్ని నెలల క్రితం రోషన్‌ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో రోషన్‌ కనకాల మొదటి మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాలోకి కొన్ని స్టిల్స్ ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం జరిగింది. అందులో రోషన్ లుక్‌ కి యూత్‌ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. షూటింగ్‌ ప్రారంభంలో రోషన్ తో పోల్చితే ఈ స్టిల్స్ లో చాలా మార్పు కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.

రోషన్ ను చాలా ట్రెండీగా, స్టైలిష్ గా దర్శకుడు రవికాంత్‌ చూపించబోతున్నాడు అని ఈ ఫోటోలు చూస్తూ ఉంటే అర్థం అవుతుందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. కచ్చితంగా ఈ సినిమా తో యూత్‌ కి రోషన్ కనకాల దగ్గర అవ్వడం ఖాయం అంటూ కొందరు జోస్యం చెబుతున్నారు.

మొత్తానికి రోషన్ కనకాల యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ అండ్‌ లవ్‌ స్టోరీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ కి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీచరణ్‌ పాకాల సంగీత దర్శకత్వంలో ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.