Begin typing your search above and press return to search.

విడాకులపై అమ్మని అడిగితే అలా చెప్పింది: సుమ తనయుడు

మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ జోరుగా చేస్తున్నారు. అందులో రోషన్ కనకాల తనని తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   11 Dec 2023 3:46 AM GMT
విడాకులపై అమ్మని అడిగితే అలా చెప్పింది: సుమ తనయుడు
X

రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిర్మల కాన్వెంట్ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన రోషన్ బబుల్ గమ్ మూవీతో హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న రవికాంత్ పేరెపు ఈ సినిమాని ఆవిష్కరించారు.

మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ జోరుగా చేస్తున్నారు. అందులో రోషన్ కనకాల తనని తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వీటిలో భాగంగా పేరెంట్స్ మీద వచ్చిన రూమర్స్ గురించి అతనికి ప్రశ్న ఎదురైంది. దీనిపై రోషన్ ఆసక్తికరంగా సమాధానం చెప్పారు.

`అమ్మ, నాన్న విడాకులు తీసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు నేను చూస్తున్నప్పుడు ఎదురుగా టేబుల్ మీద కూర్చొని ఇద్దరు భోజనం చేస్తున్నారు. కలిసి సరదాగా మాట్లాడుతున్నారు. అయితే డౌట్ వచ్చి విడాకుల వార్తలపై అమ్మని నేరుగా అడిగాను. ఆ రూమర్స్ ని సీరియస్ గా తీసుకోవద్దని సలహా ఇచ్చింది. అందులో ఒక్క శాతం కూడా వాస్తవం ఉండదని దాంతో నాకు క్లారిటీ వచ్చిందని రోషన్ చెప్పుకొచ్చాడు.

అమ్మ, నాన్న గొడవ పడటం అనేది కామన్ గా అందరి ఇళ్ళల్లో జరిగినట్లే మా ఇంట్లో కూడా జరుగుతుంది. చిన్న చిన్న సందర్భాలలో, చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. నాన్న ఆలస్యంగా నిద్రలేస్తే అమ్మ సీరియస్ అవుతుంది. ఇలాంటి సిల్లీ గొడవలు తప్ప నేను వారిద్దరూ ఎప్పుడూ సరదాగా ఉండటమే నేను చూస్తాను. గొడవలు జరిగిన వెంటనే మాట్లాడేసుకుంటారు అని రోషన్ క్లారిటీ ఇచ్చాడు.

అమ్మ, నాన్న గురించి విడాకులు వార్తలు చూసిన తర్వాత అలాంటి గాసిప్స్ గురించి పట్టించుకోవడం మానేసాను. ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. వాటిని కేర్ చేయాల్సిన అవసరం లేదని లైట్ తీసుకున్నా అని రోషన్ తన పేరెంట్స్ రిలేషన్ షిప్ గురించి ఇంటర్వ్యూలో పంచుకున్నాడు