Begin typing your search above and press return to search.

మృణాల్, సుమంత్ ఫోటో.. నటుడు ఏమన్నారంటే?

హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నటుడు సుమంత్ కలిసి దిగిన ఫోటో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 May 2025 3:50 PM
మృణాల్, సుమంత్ ఫోటో.. నటుడు ఏమన్నారంటే?
X

హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నటుడు సుమంత్ కలిసి దిగిన ఫోటో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఫోటోలో చనువుగా ఉన్నట్లు కనిపిస్తుండడంతో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని రూమర్లు వినిపిస్తున్నాయి.

అయితే సీతారామం సినిమాకు గాను సుమంత్, మృణాల్ ఠాకూర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ మూవీలోని హీరోయిన్ గా ఆమె నటించగా.. సుమంత్ నెగిటివ్ రోల్ లో కనిపించారు. అప్పుడు పరిచయం.. ప్రేమగా మారిందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిపై ఇప్పటి వరకు మృణాల్, సుమంత్ రెస్పాండ్ అవ్వకపోవడంతో మరో విధంగా టాక్ వినిపించింది.

తాజాగా ఆ విషయంపై సుమంత్ స్పందించారు. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ అనగనగా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడారు. తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని తెలిపారు. అందుకే అందులో తన గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా పట్టించుకోనని చెప్పారు. ఏ ఫోటో గురించి అడుగుతున్నారో కూడా తెలియదని అన్నారు.

అయితే గతంలో సుమంత్.. హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలానికే విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్నారు. ఆ నేపథ్యంలోనే రెండో పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. అయితే తాను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నట్లు మరోసారి తెలిపారు సుమంత్. హ్యాపీగా బతుకుతున్నానని వెల్లడించారు.

దీంతో సెకండ్ మ్యారేజ్ కు ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్ చూపించడం లేదని అర్థమవుతుంది. కాబట్టి మృణాల్ ది ఫ్రెండ్ షిప్ అవ్వచ్చు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు సుమంత్. నిర్మాణం వైపు కూడా దృష్టి సారించడం లేదు. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత అనగనగాతో రానున్నారు. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

అయితే తనకు సినిమాలు తీసే ఉద్దేశం లేదని తెలిపారు. ఉన్నవాటిని జాగ్రత్తగా కాపాడుకుంటానని పరోక్షంగా చెప్పారు. ముఖ్యంగా తనకున్న వ్యాపకాలు తనకు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సినిమాలు చేస్తేనే ఆడియన్స్ గుర్తుంచుకుంటారన్న భయం లేదని తెలిపారు. ప్రస్తుతం తన ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన సినిమాలే చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు సుమంత్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.