తాత-మామ కంటే కృష్ణ, మహేష్ అభిమానిగా!
సెలబ్రిటీల కుటుంబాలకు సంబంధించి మరో సెలబ్రిటీని అభిమాన నటుల గురించి చెప్పామంటే చాలా మంది దాదాపు తమ కుటుంబాల్లో ఉన్న హీరోల పేర్లే చెబుతారు
By: Tupaki Desk | 18 July 2025 8:00 AM ISTసెలబ్రిటీల కుటుంబాలకు సంబంధించి మరో సెలబ్రిటీని అభిమాన నటుల గురించి చెప్పామంటే చాలా మంది దాదాపు తమ కుటుంబాల్లో ఉన్న హీరోల పేర్లే చెబుతారు. మెగా ఫ్యామిలీ తీసుకున్నా, నందమూరి ఫ్యామిలీ తీసుకున్నా, దగ్గుబాటి ఫ్యామిలీ తీసుకున్నా? వాళ్లలో స్పూర్తి నింపింది ఎవరు? ఎవరు ఆదర్శం గా ఇండస్ట్రీకి వచ్చారంటే ఆ కుటుంబంలో నటుల పేర్లే వినిపస్తుంటాయి. అలాగే వాళ్లనే అమితంగా ఆరాదిస్తున్నట్లు..అభిమానిస్తుట్లు తెలుస్తుంది. ఇది టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ ఫ్యామిలీలను టచ్ చేసిన ఇలాంటి సమాధానమే వస్తుంది.
సహజంగానే కుటుంబ ప్రీతి ఉంటుంది కాబట్టి ఆ రకంగా చెప్ప డంలో తప్పేం లేదు. కానీ అక్కినేని కుటుంబం నుంచి పరిచయమైన సుమంత్ మాత్రం ఇలాంటి వాళ్లందరకీ భిన్న అని ప్రూవ్ చేసాడు. అక్కినేని కుటుంబంలో ఏఎన్నార్ ఓ లెజెండరీ నటుడు. ఆ తర్వాత తరంలో ఆయన వారసుడు నాగార్జున పెద్ద స్టార్ అయ్యారు. ఆ తర్వాత అదే వంశం నుంచి నాగచైతన్య, అఖిల్ కూడా తెరంగేట్రం చేసారు. చై, అఖిల్ కంటే ముందే సుమంత్ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కొన్ని సినిమాలతో సుమంత్ కూడా బాగానే ఫేమస్ అయ్యాడు. కాలక్రమంలో అవకాశాలు తగ్గడంతో సినిమాలు కూడా తగ్గించాడు. ప్రస్తుతం మంచి పాత్రలు వస్తే తప్ప నటించడం లేదు. `మళ్లీ రావా`తో బౌన్స్ బ్యాక్ అయ్యాడనుకున్నా? ఆ సక్సస్ ను కంటున్యూ చేయలేకపోయాడు. అయితే తాజాగా ఓ ఇంట ర్వ్యూలో మీకు బాగా ఇష్టమైన నటులు ఎవరు? అంటే సూపర్ స్టార్ కృష్ణ.. ఆ తర్వాత వాళ్లబ్బాయ్ మహేష్ అంటూ సమాధానం ఇచ్చారు.
నా పక్కన తాతయ్య ఉన్నా? నాగ్ మామ ఉన్నా? కూడా తన నుంచి ఇదే సమాధానం వస్తుందన్నాడు. వాటిని తాతయ్య..మాయయ్య లు కూడా అంతే స్పోర్టివ్ గా తీసుకుంటారన్నాడు. నా ఫ్యామిలీ నటుల్నే నేను అభిమానించాలని లేదు కదా? మనసుకు ఎవరు నచ్చితే వారినే అభిమానిస్తాం` అన్నారు. అంతే కదా సినిమా అనే అభిమానానికి హద్దులేలే? అలా అనుకుంటే? ప్రతీ అభిమాని తన ఇంట్లో వారినే అభి మానించాలి.
