Begin typing your search above and press return to search.

సుమంత్ గ్రాఫిక్స్ సినిమా.. 25 కోట్లు, స్టార్ క్యామియోనా..

టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ స్పీడ్ పెంచారని చెప్పాలి. ఓటీటీలో వచ్చిన అనగనగా మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఆయన.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2026 12:35 PM IST
సుమంత్ గ్రాఫిక్స్ సినిమా.. 25 కోట్లు, స్టార్ క్యామియోనా..
X

టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ స్పీడ్ పెంచారని చెప్పాలి. ఓటీటీలో వచ్చిన అనగనగా మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఆయన.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మహేంద్రగిరి వారాహి మూవీ చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ సూపర్‌ నేచురల్‌ చిత్రంగా రూపొందుతున్న ఆ సినిమా స్టోరీ.. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరగనుంది.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను మధు కాలిపు నిర్మిస్తుండగా.. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. సోమవారం నాడు సుమంత్ బర్త్ డే కానుకగా మేకర్స్ రివీల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గ్లింప్స్.. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి.

పౌరాణిక అంశాలు, అడ్వెంచర్ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఉండనున్న మహేంద్రగిరి వారాహి సినిమాను భారీ స్థాయిలో మేకర్స్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.15-20 కోట్లకుపైగా బడ్జెట్ అయినట్లు వినికిడి. దీంతో సుమంత్ కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ మూవీ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మేకింగ్ అండ్ ప్రొడక్షన్ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడడం లేదని టాక్.

అదే సమయంలో సినిమాలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. వారిద్దరూ మూవీలో క్యామియో రోల్స్ లో కనిపించనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. మూవీ రేంజ్ ను పెంచేందుకు.. వారిద్దరినీ రంగంలోకి మేకర్స్ దించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సిద్ధుకు యూత్‌ లో ఉన్న క్రేజ్, కీర్తి సురేష్‌ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో వారి రోల్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి.

అయితే ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ కూడా సినిమాల సక్సెస్ ను నిర్ణయించే కీలక అంశంగా మారిందని ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. మంచి ఫేమ్ ఉన్న స్టార్స్.. చిన్న పాత్రల్లో కనిపించినా ఓటీటీ డీల్స్ వాల్యూ పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు మహేంద్రగిరి వారాహి మూవీకి స్టార్ క్యామియోలు ప్లస్ పాయింట్ గా మారుతాయని అంటున్నారు నెటిజన్లు.

ఇప్పటికే కొన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలు సినిమాపై ఇంట్రెస్ట్ చూపించినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు పాన్ ఇండియా రేంజ్ లో మూవీ విడుదల అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మహేంద్రగిరి వారాహి మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో సుమంత్ కు ఆ చిత్రం ఎలాంటి హిట్ ఇస్తుందో.. స్టార్ క్యామియోలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో అన్నది వేచి చూడాలి. రిలీజ్ డేట్ పై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.