Begin typing your search above and press return to search.

స్టార్ యాంకర్ పై బ్రహ్మాజీ పంచులు..!

సక్సెస్ ఫుల్ యాంకర్ సుమ ఈమధ్య ట్రోల్స్ కి గురవుతున్నారు. స్టార్ సినిమా ఈవెంట్ అంటే సుమ హోస్ట్ గా చేయాల్సిందే

By:  Tupaki Desk   |   5 Dec 2023 6:19 AM GMT
స్టార్ యాంకర్ పై బ్రహ్మాజీ పంచులు..!
X

సక్సెస్ ఫుల్ యాంకర్ సుమ ఈమధ్య ట్రోల్స్ కి గురవుతున్నారు. స్టార్ సినిమా ఈవెంట్ అంటే సుమ హోస్ట్ గా చేయాల్సిందే. అయితే ఈమధ్య కొన్ని ఈవెంట్స్ లో ఆమె చేసిన కామెంట్స్ ట్రోలర్స్ కి మంచి స్టఫ్ అయ్యేలా చేస్తుంది. రీసెంట్ గా సుమ మీడియా వాళ్ల మీద చేసిన కామెంట్స్ కు వారి రియాక్షన్ తెలిసిందే. ఆ విషయంలో సుమని కొందరు సపోర్ట్ కూడా చేశారు.

లేటెస్ట్ గా సుమ అడ్డా షో లో బ్రహ్మాజీ ఆమె మీద పంచులు వేస్తూ ఫన్ జెనరేట్ చేశాడు. నితిన్ హీరోగా నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రమోషన్స్ లో భాగంగా సుమ అడ్డా షోలో పాల్గొన్న ఆ టీం సుమ మీద వరుస పంచులతో సందడి చేశారు బ్రహ్మాజీ. బ్రహ్మాజీ ఏదో తింటుంటే తినడం అయ్యిందా అంటే ఇది టిఫిన్, భోజనం కాదని అంటాడు. అంతేకాదు సుమ ఏం మాట్లాడినా భోజనాలు ఎప్పుడు పెడతారని అన్నాడు.

సుమ మీడియా వాళ్ల మీద వేసిన కామెడీని ఆమె మీద పంచులతో టార్గెట్ చేశాడు బ్రహ్మాజీ. అయితే ఇదంతా సుమ చాలా స్పోర్టివ్ గా తీసుకుంది. అయితే షోలో పాల్గొన్న వక్కంతం వంశీ ఆమెతో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తుంది. ప్రతి వారం రిలీజ్ అవుతున్న సినిమా యూనిట్ సుమ అడ్డా షో కి వచ్చి అక్కడ సందడి చేస్తారు. సుమ షో కి వస్తే సినిమాకు కావాల్సిన ప్రమోషన్ అందుతుందని వారు భావిస్తారు.

నితిన్ శ్రీ లీల జంటగా నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు హారీస్ జయరాజ్ మ్యూజిక్ అందించారు. డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ మీద చిత్ర యూనిట్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. సినిమాలో యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. నితిన్ మార్క్ ఎంటర్టైనర్ మూవీగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ వస్తుంది. సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్ మార్క్ ఎంటర్టైనర్ మూవీగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ వస్తుంది. సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటించారు. సినిమా టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేయగా కచ్చితంగా ఆడియన్స్ అందరిని ఈ సినిమా ఆకట్టుకుంటుందని అంటున్నారు.