Begin typing your search above and press return to search.

సుల్తాన్ ఆఫ్ డిల్లీ ట్రైల‌ర్ క్యూరియ‌స్

సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సిరీస్ అర్నాబ్ రాయ్ పుస్తకం 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: అసాస‌న్' ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్ తో మిలన్ డిజిటల్ లో రంగప్రవేశం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 11:54 AM GMT
సుల్తాన్ ఆఫ్ డిల్లీ ట్రైల‌ర్ క్యూరియ‌స్
X

డాన్ క‌థ‌లతో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుద‌లై ఆక‌ట్టుకున్నాయి. అదే కోవ‌లో మ‌రో డాన్ సిరీస్ వీక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. తాజాగా 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' ట్రైలర్ విడుదలైంది. మిలన్ లుథ్రియా మరోసారి గ్యాంగ్‌స్టర్ డ్రామాతో కంబ్యాక్ అయ్యాడు. అత‌డు 'వన్స్ అపాన్ ఎ టైమ్' ఫ్రాంచైజీ .. టాక్సీ నంబర్ 9211 వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సిరీస్ అర్నాబ్ రాయ్ పుస్తకం 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: అసాస‌న్' ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్ తో మిలన్ డిజిటల్ లో రంగప్రవేశం చేస్తున్నారు.

మూడు నిమిషాల ట్రైలర్‌లో ఒక యువకుడు దేశ విభజనను ఎదుర్కొనే ప్రాసెస్ లో ఏం జ‌రిగింద‌న్న‌ది తెర‌పై చూపారు. అదే యువ‌కుడు ఆ తర్వాత 1960లలో అండర్ వరల్డ్‌కి కింగ్‌పిన్‌గా ఎలా మారాడనేది ఈ సిరీస్ లో చూపించారు. తాహిర్ రాజ్ భాసిన్ పాత్ర ద్వారా నగరాన్ని పాలించాలనే యువ‌కుడి ఆశయాన్ని తెర‌పై ఆవిష్క‌రించారు. తాహిర్ పాత్ర ఆస‌క్తిక‌రం. అత‌డు సరిహద్దుల ఆవ‌ల‌ పుట్టాడని, అన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ ఢిల్లీకి వచ్చాడ‌ని బలాన్ని పొందాడని ట్రైల‌ర్ పేర్కొంది. ట్రైలర్‌లోని మిగిలిన భాగం రాజకీయ కుయుక్తులు, ద్రోహం, మైండ్ గేమ్‌, తుపాకీ శ‌బ్ధాలతో అధికార దాహం నిండిన దుర్మార్గపు పోరాటాన్ని చూపిస్తుంది.

సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో నిశాంత్ దహియా, హర్లీన్ సేథీ, అనుప్రియ గోయెంకా .. వినయ్ పాఠక్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా సిరీస్‌లో మౌని రాయ్ కూడా ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో కనిపించనుంది. మౌని చివరిగా అయాన్ ముఖర్జీ 'బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ'లో నటించింది. అలాగే తాహిర్ రాజ్ భాసిన్ చివరిసారిగా క్రైమ్ థ్రిల్లర్ 'లూప్ లాపేట'లో కనిపించాడు. 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' సిరీస్ ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. అక్టోబర్ 13 నుండి డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.