Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఛాన్స్ లేదు కానీ సుకుమార్ ప్లాన్ ఏంటంటే..?

పుష్ప సినిమాలో ఆడియన్స్ కథ కథనాల కన్నా కూడా పుష్ప రాజ్ క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అయ్యారు

By:  Tupaki Desk   |   2 Feb 2024 9:30 AM GMT
పుష్ప 2 ఛాన్స్ లేదు కానీ సుకుమార్ ప్లాన్ ఏంటంటే..?
X

పుష్ప 1 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ పుష్ప 2 ని కూడా ఆడియన్స్ అంచనాలు ఎన్నైతే పెట్టుకుంటారో వాటిని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సుకుమార్ అల్లు అర్జున్ ఈ కాంబినేషన్ ఎప్పుడు ప్రేక్షకులను నిరుత్సాహ పరచదు. ఆర్య నుంచి పుష్ప 1 వరకు సినిమా సినిమాకు వారి కాంబినేషన్ మీద హైప్ పెంచుతున్నారే తప్ప తగ్గించట్లేదు. ఈ క్రమంలో పుష్ప 2 గురించి ఎన్ని హోప్స్ ఉన్నా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

పుష్ప సినిమాలో ఆడియన్స్ కథ కథనాల కన్నా కూడా పుష్ప రాజ్ క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అయ్యారు. పుష్ప రాజ్ నీయవ్వ తగ్గేదేలే అని యాటిట్యూడ్ ఆడియన్స్ కు బాగా ఎక్కేసింది. పుష్ప 1 లో సిండికేట్ లీడర్ గా మారగానే కథ అంతటితో ఆపాడు సుకుమార్. ఇక ఎస్.పి వచ్చి పుష్ప రాజ్ ఈగో మీద దెబ్బ కొట్టడం.. నీ బ్రాండ్ ఏంటని అతన్ని హేలన చేయడంతో బ్లడ్ చూపించి మరి ఇది సార్ నా బ్రాండ్ అని చెప్పాడు. అలా పుష్ప రాజ్ వర్సెస్ షెఖావత్ మధ్య వైరం మొదలైంది.

సెకండ్ హాఫ్ లో ఈ ఇద్దరి మధ్య ఫైట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. అయితే పుష్ప 2 తర్వాత కూడా పుష్ప 3 ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈమధ్య హీరోయిన్ రష్మిక కూడా పుష్ప ఒకచోట ఆగే కథ కాదని హింట్ ఇచ్చింది. అయితే సుకుమార్ పుష్ప 3 కూడా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పుష్ప 3 లో పుష్ప రాజ్ క్యారెక్టర్ ని కొనసాగించి వేరే ప్రాంతంలో కథ రాసుకుంటాడని తెలుస్తుంది.

అంటే పుష్ప రాజ్ వల్లే ఆ సినిమాకు అంత క్రేజ్ కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ తోనే వేరే కథని చెప్పాలనే ప్లాన్ లో ఉన్నాడు సుకుమార్. పుష్ప 2 కూడా హిట్ అయితే పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది. కథను కొనసాగిస్తారా లేదా పాత్రల స్వభావాలతో కొత్త కథ రాసుకుంటాడా అన్నది తెలియదు కానీ సుక్కు మాత్రం పుష్ప ని ఇప్పుడప్పుడే వదిలేలా లేడని చెప్పొచ్చు. పుష్ప పాత్రలో ఎన్ని సినిమాలు తీసినా తనకు ఓకే అని అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.