Begin typing your search above and press return to search.

రూలింగ్ లయన్.. మన సుక్కూ మాస్టర్!

పుష్ప సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఎంత భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   12 Feb 2024 10:16 AM GMT
రూలింగ్ లయన్.. మన సుక్కూ మాస్టర్!
X

పుష్ప సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఎంత భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు నార్త్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ మూవీ సాంగ్స్, డైలాగ్స్ తగ్గేదేలే అంటూ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లెక్కల మాస్టర్ సుకుమార్.. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రతలు తీసుకుంటున్నారు.


ఇక పుష్ప 2 సినిమాను ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు మేకర్స్. కానీ ఇటీవల ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక పుష్ప 2 సెట్ లో సుకుమార్ ను క్యాండిడ్ ఫొటో తీసింది. షూటింగ్ గ్యాప్ లో ఓ సింహం బొమ్మపై సరదాగా చెయ్యి పెట్టి నవ్వుతున్న సుకుమార్ ను ఫొటో తీసి తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్మిక షేర్ చేసిన పిక్ లో సుకుమార్‌ కనిపిస్తున్న విధానం అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. కమాండింగ్‌ గా, ఫిల్మ్‌ మేకింగ్‌లో ఓ మాస్టర్‌లా, అథారిటీతో కనిపిస్తున్నారని అంటున్నారు. మూవీ సెట్ లో రూలింగ్ లయిన్ అంటూ సుకుమార్ ను పొగుడుతున్నారు. సెట్‌లో సుకుమార్‌ ఎలా ఉంటారు? ఎంతటి క్రియేటివిటీ చూపిస్తారు? అనేది ఈ పిక్ చూస్తే తెలిసిపోతుందని చెబుతున్నారు. అలాగే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవం కూడా ఆ పోస్ట్‌లో అర్థమవుతోందని కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు, రష్మిక తీసిన సుకుమార్ పిక్ ను అఫీషియల్ గా పుష్ప నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోందని, 2024 ఆగస్టు 15 వ తేదీన పుష్ప 2 రిలీజ్ అవుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ పోస్ట్ తో పుష్ప 2 వాయిదా వార్తలకు మరోసారి చెక్ పెట్టారు మేకర్స్. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హైలైట్ గా నిలవనున్న గంగమ్మ జాతర ఎపిసోడ్ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఓ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చిన జగదీశ్ బండారికి సంబంధించిన సీన్లను పూర్తి చేస్తున్నారు మేకర్స్. మరోవైపు, పుష్ప 3 ఉంటుందని వార్తలు వస్తున్నా.. చిత్ర యూనిట్ రెస్పాండ్ అవ్వడం లేదు. పుష్ప 2 చివర్లో సర్ప్రైజ్ ఇస్తారా లేక విడుదలకు ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఈ విషయంపై క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి.