Begin typing your search above and press return to search.

ఆ హీరోతో సుకుమార్.. ఏమైనట్లు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చూసిన దర్శకులలో సుకుమార్ కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   13 March 2024 3:15 AM GMT
ఆ హీరోతో సుకుమార్.. ఏమైనట్లు?
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చూసిన దర్శకులలో సుకుమార్ కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా ఆయన పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఇక సుకుమార్ పుష్ప 2 సినిమాతో వెయ్యి కోట్లు మార్కెట్ ను టచ్ చేస్తాడా లేదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో 1000 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అని కూడా గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సుక్కు నుంచి రాబోయే ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి అనేది మరింత ఆసక్తిగా మారింది. రామ్ చరణ్ తో ప్రాజెక్టు అయితే ఉండబోతోంది. ఇదివరకే కొన్నిసార్లు ఈ కాంబినేషన్ పై క్లారిటీ వచ్చేసింది.

రాజమౌళి కూడా ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సుకుమార్ ప్రాజెక్టు ఉండబోతుంది అని ఆ కథకు సంబంధించిన ఎంట్రీ సీన్ కూడా తనకు తెలుసని ఒక చిన్న పాయింట్ చెప్పాడు. ఇక సుకుమార్ లిస్టులో రామ్ చరణ్ తో పాటు మరొక హీరో కూడా ఉన్నాడు. అతనే విజయ్ దేవరకొండ. గతంలో విజయ్ ప్రత్యేకంగా సుకుమార్ ని కలిశాడు. ఒక స్టోరీ గురించి కూడా చర్చించడం జరిగింది.

ర్యాంపేజ్ అంటూ ఒక టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్లు టాక్ వచ్చింది. విజయ్ కూడా సుకుమార్ తో సినిమా ఉంటుందని అప్పట్లో సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్టుపై మళ్ళీ ఆ తరువాత ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మధ్యలో క్యాన్సిల్ అన్నట్లు కూడా కథనాలు వచ్చాయి. సాధారణంగా సుకుమార్ ఒక ప్రాజెక్టు షూటింగ్ దశలో ఉంటే దాని గురించి తప్పించి మరొక దాని గురించి ఏమాత్రం ఆలోచించడు.

ముందుగా రామ్ చరణ్ తో అయితే ఒక కమిట్మెంట్ ఉంది. ఇచ్చిన మాట ప్రకారం సుక్కు అయితే విజయ్ తో సినిమా చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు. కాకపోతే టైమ్ కలిసి రావాలి. సుక్కు పుష్ప 2 సినిమా కోసమే చాలా టైమ్ తీసుకున్నాడు. ఇక రామ్ చరణ్ తో రెండేళ్ల సమయం పట్టవచ్చు. అనంతరం విజయ్ ఒప్పుకుంటే సుక్కు డైరెక్షన్ లో సినిమా ఉండవచ్చు. మరి ఆ సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ విడుదలకు సిద్దంగా ఉండగా మరోవైపు తన 12వ సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నాడు. ఇక త్వరలోనే మరో రెండు కొత్త ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.