Begin typing your search above and press return to search.

సుకుమార్ మరో హిట్ కాంబో.. లెక్క తేలేది ఆరోజే!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు సుకుమార్.

By:  Tupaki Desk   |   20 March 2024 9:07 AM GMT
సుకుమార్ మరో హిట్ కాంబో.. లెక్క తేలేది ఆరోజే!
X

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు సుకుమార్. మొదటి సినిమా నుంచి ప్రతి కథలో కూడా మ్ వైవిధ్యాన్ని చూపిస్తూ తన హోదాను పెంచుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో ఎలాంటి గుర్తింపు దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా ఇప్పుడు సుకుమార్ కు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది.

పుష్ప 2పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ సినిమాకు మంచి డీల్స్ దొరికే అవకాశం అయితే ఉంది. దాదాపు 1000 కోట్ల బిజినెస్ టార్గెట్ గా పుష్ప 2 సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ ఏ హీరోతో చేస్తాడు అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. చాలా రోజులుగా వినిపిస్తున్న మాట ఏమిటి అంటే.. సుకుమార్ లిస్టులో రామ్ చరణ్ ఉన్నాడు అని.

ఒక విధంగా గతంలోనే ఈ కాంబినేషన్ పై రాజమౌళి ఒక క్లారిటీ ఇచ్చారు. RRR ఇంటర్వ్యూలలో సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది అని అందుకు సంబంధించిన స్టోరీ గురించి కూడా తనకు తెలుసు అని వివరణ ఇచ్చాడు. ఇక సుకుమార్ పుష్ప తర్వాత రామ్ చరణ్ తో తప్పకుండా సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.

ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బిజిలో ఒక ఏడాది అనంతరం రామ్ చరణ్ సుకుమార్ కు కాస్త స్పేస్ దొరికే అవకాశం కనిపిస్తోంది. ఇక సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ పై ఒక అఫీషియల్ అప్డేట్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో అదే రోజు అతని భవిష్యత్తు సినిమాలపై అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

ఇక అందులో భాగంగానే సుకుమార్ ప్రాజెక్టుపై కూడా ఒక అఫీషియల్ క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే ఇప్పుడు బుచ్చిబాబుతో తన 16 సినిమాను కూడా అఫీషియల్ గా లాంచ్ చేశాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్ తో ప్రాజెక్టును చేయాలి అని అనుకుంటున్నాడు.

ఇక రంగస్థలంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుందనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. మరో వైపు సుకుమార్ పుష్ప 2కి కొనసాగింపుగా మూడవ భాగం ఉంటుంది అని కూడా రకరకాల గాసిప్స్ వస్తున్నాయి. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.