Begin typing your search above and press return to search.

వారెవ్వా.. లిప్ లాక్ పై సుక్కు క్లారిటీ సూపర్..!

సినిమా ఆ అంచనాలను అందుకునేందుకు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 April 2024 4:30 PM GMT
వారెవ్వా.. లిప్ లాక్ పై సుక్కు క్లారిటీ సూపర్..!
X

పుష్ప కు ముందు సుకుమార్ కేవలం తెలుగు దర్శకుడే.. ఎప్పుడైతే పుష్ప వచ్చిందో ఆ సినిమా సౌత్ ఆడియన్స్ కు ఈక్వల్ గా ఎక్కేసింది. పుష్ప రాజ్ నీయవ్వ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ మాస్ యాటిట్యూడ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 2 ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. సినిమా ఆ అంచనాలను అందుకునేందుకు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు.

ఆర్య సినిమా నుంచి డైరెక్టర్ గా సుకుమార్ తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. పుష్ప తో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. అయితే పుష్ప కు ముందు చేసిన రంగస్థలం సినిమా డైరెక్టర్ గా సుకుమార్ స్టామినా ఏంటో చూపించింది. అంతకుముందు సుకుమార్ తీసిన సినిమాలన్నీ చాలా క్లాస్ గా అనిపించాయి. రాం చరణ్ తో చేసిన రంగస్థలం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

రంగస్థలం సినిమా టైం లో చరణ్ హీరోగా ఫిక్స్ కాగా హీరోయిన్ గా కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారట సుకుమార్. ఇద్దరు పెద్ద స్టార్స్ అయితే మ్యానేజ్ చేయడం కష్టమని సుకుమార్ తన సినిమాల్లో హీరోయిన్స్ ని కొత్త వారిని తీసుకుంటాడు. అయితే రామలక్ష్మి పాత్రకు కొత్త వారైతే కష్టమని యూనిట్ సభ్యుల సలహామేరకు సమంతని తీసుకున్నారట. సినిమాలో ప్రతి సీన్ కు సమంత చేసిన యాక్టింగ్ కు సుకుమార్ ఫిదా అయ్యాడట.

అంతకుముందు సమంత మీద ఎలాంటి అభిప్రాయం లేని సుకుమార్ తన సినిమాలో నటించిన తర్వాత ఆమె గొప్ప నటి అని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు ఆమె ఏ ఏజ్ లో ఉన్నా అందుకు తగిన పాత్ర రాసి ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారట. అందుకే పుష్ప 1 లో ఉ అంటావా సాంగ్ కు సమంతని తీసుకున్నారు సుకుమార్. అయితే రంగస్థలం టైం లో సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నారు. అయినా కూడా సినిమాలో పాత్ర కోసం లిప్ లాక్ చేశారు.

ఆ సినిమా ఈవెంట్ లో సుకుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. సందర్భం వచ్చినప్పుడు అమ్మాయి అబ్బాయి చెయ్యి ఎలా పట్టుకుంటుందో లిప్ లాక్ కూడా అంతే.. దాన్ని కళాత్మక కోణంలో చూడాలి తప్ప మరోలా అర్థం చేసుకోకూడదని అన్నారు. రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర అలా ఉంటే చిట్టి బాబు పాత్రలో చరణ్ నట విశ్వరూపం మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేసింది. అప్పటివరకు చరణ్ యాక్టింగ్ మీద కామెంట్స్ చేసే ప్రతి ఒక్కరి డౌట్లన్నీ తీర్చేస్తూ చిట్టి బాబు రీ సౌండ్ అదిరిపోయేలా చేశాడు. పుష్ప 2 తర్వాత సుకుమార్ మరోసారి రాం చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా మాత్రం గ్లోబల్ రేంజ్ లో ఉండబోతుందని టాక్.