సుకుమార్‌తో తబితా.. ఉప్పెనంత ప్రేమ!
తబితా పసుపు రంగు డ్రెస్‌లో మెరిసిపోతుంటే.. ఆమె ముఖంలో చిరునవ్వు, ఫ్లయింగ్ కిస్ వంటి అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ అభిమానుల మనసులు దోచేస్తున్నాయి.
By: Tupaki Desk | 16 April 2025 6:04 PMప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమాల్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయో తెలిసినవారికి.. ఆయన నిజ జీవితంలో ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. ఆయన భార్య తబితా సుకుమార్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో తబితా ఓ బిల్డింగ్ విండోలో నిలుచుండగా, కింద నుంచి సుకుమార్ ఆమెను ప్రేమగా చూస్తున్న తీరు చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది.
తబితా పసుపు రంగు డ్రెస్‌లో మెరిసిపోతుంటే.. ఆమె ముఖంలో చిరునవ్వు, ఫ్లయింగ్ కిస్ వంటి అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ అభిమానుల మనసులు దోచేస్తున్నాయి. ఈ ఫోటో కింద తబితా పెట్టిన రెడ్ హార్ట్ ఎమోజీ ద్వారా ఆమె మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ఇందులో మ్యూజిక్ ట్రాక్‌గా 'ఉప్పెనంత ప్రేమ' పాట ప్లే అవుతుండటం వల్లే ఈ ఫోటోకి మరింత ఎమోషనల్ కంటెంట్ వచ్చింది.
తబితా తన పర్ఫెక్ట్ ఫ్యామిలీ పర్సన్ గా కుటుంబానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చినవారిగా గుర్తింపు పొందారు. కానీ సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టులు చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఆమె పోస్ట్ చేసిన ప్రతీ ఫోటో కూడా అభిమానుల్లో ప్రేమను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సుకుమార్ తబితా జంట కనిపించే ఫోటోలు విపరీతమైన క్రేజ్‌ను సంపాదిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నా.. వ్యక్తిగతంగా భార్యతో ఉన్న ప్రతి క్షణాన్ని సుకుమార్ ఎంతో ఇష్టంగా గడుపుతున్నట్టు ఈ ఫోటో నుంచి అర్థమవుతోంది. ఇన్‌స్టా ఫాలోవర్స్ ఈ ఫోటోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇదే నిజమైన ప్రేమ" అంటూ కామెంట్స్ చేస్తూ, ఈ జంటను పొగిడేస్తున్నారు.