సుకుమార్ స్కూల్ నుంచి మరో ఇద్దరు!
ఇండస్ట్రీలో సక్సెస్ పుల్ శిష్యులు ఎవరు ఉన్నారంటే? సుకుమార్ కాలరెగరేసి మరీ చెప్పొచ్చు నాకున్నారని.
By: Tupaki Desk | 26 April 2025 1:30 AMఇండస్ట్రీలో సక్సెస్ పుల్ శిష్యులు ఎవరు ఉన్నారంటే? సుకుమార్ కాలరెగరేసి మరీ చెప్పొచ్చు నాకున్నారని. `కుమారి 21 ఎఫ్` ఫేం పల్నాటి సూర్య ప్రతాప్, `ఉప్పెన` ఫేం బుచ్చిబాబు , `దసరా` ఫేం శ్రీకాంత్ ఓదెల వీళ్లంతా సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లగా పనిచేసి దర్శకులైన వారే. ప్రస్తుతం శ్రీకాంత్ ...బుచ్చిబాబు మంచి ఫాంలో ఉన్నారు. గురువు తరహాలోనే స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేస్తున్నారు.
వీళ్లిద్దరికీ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉంది. ప్యూచర్ లో గురువునే మించిన శిష్యులైనా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఇలాంటి మాణిక్యాలు వీళ్లిద్దరే కాదు. ఇంకా సుకుమార్ వద్ద మరికొంత మంది ఉన్నారు. `పుష్ప2` ప్రచారంలో భాగంగా పబ్లిక్ గానే కొంత మందిని స్టేజ్ మీదకు ఆహ్వానించి వారిని ప్రేక్షకులకు పరిచయం చేసి భవిష్యత్ లో పెద్ద డైరెక్టర్లు కాబోతున్నారని సుకుమార్ చెప్పిన సంగతి తెలిసిందే.
తనను మించిన ఐడియాలజీ...క్రియేటివిటీతో తన టీమ్ పనిచేస్తుందన్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే విభాగంలో వాళ్లంతా తనకంటే బెటర్ గా పనిచేస్తారన్నారు. వాళ్ల వద్ద మంచి స్టోరీ ఐడియాలున్నాయని...అవి చాలా అడ్వాన్స్ గా ఉన్నాయన్నారు. తాజాగా సుకుమార్ పరిచయం చేసిన టీమ్ లో ఓ ఇద్దరు వచ్చే ఏడాది డైరెక్టర్లగా ప్రమోట్ అవుతున్నట్లు సమాచారం. వాళ్ల పేర్లు బయటకు రాలేదు గానీ వచ్చే ఏడాది సుకుమార్ రైటింగ్స్ లో వారిద్దరిని డైరెక్టర్లగా పరిచయం చేసే బాధ్యత కూడా సుక్కు తీసుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.
వాళ్లిద్దరికీ హీరోలను...సహ నిర్మాతలను అప్పగించి బయటకు డైరెక్టర్లుగా పంపించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు... పల్నాటి సూర్య ప్రతాప్ లను అలాగే లాంచ్ చేసారు. అదే విధా నంలో కొత్తగా వచ్చే ఇద్దర్నీ తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి ప్రతిభావంతులు సుకుమార్ వద్ద ఇంకా మరో ఐదుగురు ఉన్నారుట. వాళ్లు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తారని సమాచారం.