Begin typing your search above and press return to search.

పుష్ప దెబ్బ.. RC 17 పై సుకుమార్ మాస్టర్ ప్లాన్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' చిత్రం సుమారు 400 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

By:  Madhu Reddy   |   17 July 2026 10:56 PM IST
పుష్ప దెబ్బ.. RC 17 పై సుకుమార్ మాస్టర్ ప్లాన్!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' చిత్రం సుమారు 400 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సక్సెస్ ఊపులో ఉండగానే, చరణ్ తన తదుపరి చిత్రం #RC17 పై పూర్తి ఫోకస్ పెట్టారు. 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఆ వివరాలు చూద్దాం..

రెండు భాగాలుగా.. 1000 కోట్ల భారీ బడ్జెట్:

దర్శకుడు సుకుమార్ 'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన ఇంపాక్ట్ మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ అనుభవంతో #RC17 ను మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట. ఇక ఈ రెండు భాగాల కోసం మేకర్స్ దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు ఫిలిం నగర్ బజ్. ఇక సుకుమార్ మార్క్ పర్ఫెక్షన్ కోసం ఈ చిత్ర షూటింగ్ మరో 2 నుండి 3 ఏళ్ల పాటు సాగనుందని తెలుస్తోంది.

పుష్పకు రెండు రెట్లు.. ఊహకందని రేంజ్:

ఈ సినిమా కథ మరియు విజువల్స్ పక్కాగా పుష్ప మూవీ కంటే రెండు రెట్లు గ్రాండ్‌గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్టోరీ లైన్ పూర్తిగా లాక్ అయిందని వినికిడి. ఇక సుకుమార్ తన కెరీర్‌లోనే బెస్ట్ స్క్రిప్ట్‌తో రామ్ చరణ్‌ను సరికొత్త మాస్ అవతారంలో చూపించబోతున్నారు. పెద్ది సక్సెస్ ఇచ్చిన జోష్‌తో చరణ్ కూడా ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు.

1500 కోట్ల టార్గెట్ - సరికొత్త రికార్డుల వేట:

రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది అత్యధిక వసూళ్లు సాధించే బిగ్గెస్ట్ మూవీ కానుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ 1500 కోట్ల మైలురాయిని సులభంగా దాటుతుందని టాక్. కేవలం అనౌన్స్‌మెంట్‌తోనే ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన ఈ కాంబో, థియేటర్లలోకి వస్తే రికార్డులన్నీ తిరగరాయడం ఖాయం.

ఇటీవల వచ్చిన 'పెద్ది' సినిమాతో చరణ్ తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకోగా, ఇప్పుడు సుకుమార్ తోడవడంతో #RC17 రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్‌కు వెళ్లనుంది. భారీ బడ్జెట్, రెండు భాగాలుగా రాబోతున్న ఈ కథ టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా మారబోతోంది. ఇక సుకుమార్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయితే, భారతీయ సినిమా చరిత్రలో రామ్ చరణ్ పేరు మరోసారి గట్టిగా మారుమోగడం ఖాయం.