Begin typing your search above and press return to search.

లండన్‌ ప్రిన్సెస్‌తో టాలీవుడ్‌ దర్శకుడు

టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుల జాబితాలో సుకుమార్‌ పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   24 May 2025 2:27 PM IST
Director Sukumar Meets Princess Anne in London
X

టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుల జాబితాలో సుకుమార్‌ పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలను రూపొందించడం ద్వారా సుకుమార్‌ టాప్ స్టార్‌ డైరెక్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడిగానూ సుకుమార్ నిలిచాడు. పుష్ప 2 సినిమాతో ఇండియాస్ టాప్‌ డైరెక్టర్‌గా సుకుమార్‌ నిలిచారు. పుష్ప 2 ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అందుకే సుకుమార్‌ తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సుకుమార్‌ తదుపరి సినిమా చరణ్‌ తో చేయబోతున్నాడు.


పుష్ప 2 సినిమా తర్వాత బ్రేక్‌ తీసుకుని హాలీడేస్‌ను సుకుమార్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా విదేశాల్లోనే టైమ్‌ స్పెండ్‌ చేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకున్న సుకుమార్‌ తాజాగా లండన్‌లో ప్రత్యక్ష్యం అయ్యాడు. శుక్రవారం రాత్రి లండన్‌లోని విండ్సర్ కాజిల్‌లో ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్స్ కౌన్సిల్‌ డిన్నర్‌ కార్యక్రమంలో సుకుమార్‌ సతీ సమేతంగా పాల్గొన్నాడు. ఆ సమయంలో లండన్‌ ప్రిన్సెస్‌ రాయల్‌ అన్నేను సుకుమార్‌ కలిశాడు. ఆ సమయంలో రాయల్‌ అన్నేతో సుకుమార్‌ దంపతులు మాటమంతి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆమెతో కలిసి సుకుమార్ దంపతులు నవ్వులు చిందిస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

దర్శకుడిగా ప్రసిద్ది గాంచిన సుకుమార్‌కి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి చెందిన అతి సుకుమార్‌కి ఈ గౌరవం దక్కడం మొత్తం ఇండియన్‌ సినిమాకు దక్కిన గౌరవంగా భావించాలి. సుకుమార్‌ సొంతం చేసుకున్న ఈ అరుదైన గౌరవంను ఆయన ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలను వారు తెగ షేర్‌ చేస్తున్నారు. అయితే ఎందుకు సుకుమార్‌ ఈ భేటీకి హాజరు అయ్యాడు, ఎలా ఆయనకు ఆహ్వానం దక్కిందని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇలాంటి ప్రెసిడెంట్స్ డిన్నర్‌కి డబ్బులు పెట్టుకుని మరీ కొందరు వెళ్తు ఉంటారని, సుకుమార్‌ ఎలా వెళ్లి ఉంటారని కొందరు సోషల్ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు.

పుష్ప ను రెండు పార్ట్‌లుగా తీయడం కోసం దాదాపు ఐదేళ్ల సమయం తీసుకున్న సుకుమార్‌ తన తదుపరి సినిమాను రామ్‌ చరణ్‌ తో తీసేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాదిలో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్‌, రామ్‌ చరణ్ కాంబోలో ఇప్పటికే రంగస్థలం సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మరోసారి వీరి కాంబోలో మూవీ వస్తే కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందనే విశ్వాసంను మెగా ప్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ 'పెద్ది' సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు పెద్ది సినిమాను రూపొందిస్తున్నాడు. పెద్ది తర్వాత చరణ్‌, సుకుమార్‌ కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.