Begin typing your search above and press return to search.

'సూసేకి' కొరియోగ్రాఫర్ కు క్రెడిట్స్.. శ్రష్టిపై సుక్కూ ప్రశంసలు

అయితే ఆ సాంగ్ కోసం ఇప్పడెందుకు అనుకుంటున్నారా?పాటలో 80 శాతం మూమెంట్స్‌ ను లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ కంపోజ్ చేసింది. ఆ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ తాజాగా వెల్లడించారు.

By:  Tupaki Desk   |   29 May 2025 6:00 AM
సూసేకి కొరియోగ్రాఫర్ కు క్రెడిట్స్.. శ్రష్టిపై సుక్కూ ప్రశంసలు
X

సుసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడయ్యో సామీ.. మెత్తాని పత్తి పువ్వులామరి సంటోడే నా సామీ.. అంటూ సాగిన పాట ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప-2లోని సాంగ్ వేరే లెవెల్ లో అలరించింది. ఇప్పటికే ట్రెండింగ్ లోనే ఉంటోంది.

సాంగ్ ఓ రేంజ్ హిట్ కాగా.. అందులో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న వేసిన స్టెప్పులు మరో రేంజ్ లో మెప్పించాయి. దాదాపు అంతా కూడా ఫిదా అయ్యారు. అందులో చాలా మంది ఆ సాంగ్ కు రీల్ కూడా చేశారు. అంతలా గుర్తుండిపోయాయి సూసేకి సాంగ్ అండ్ స్టెప్పులు. ప్రతి ఒక్కరు లేచి స్టెప్పులేసేలా బీట్ ఉంటుంది.

అయితే ఆ సాంగ్ కోసం ఇప్పడెందుకు అనుకుంటున్నారా?పాటలో 80 శాతం మూమెంట్స్‌ ను లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ కంపోజ్ చేసింది. ఆ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ తాజాగా వెల్లడించారు. సీతా పయనం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఆయన.. శ్రష్టి వర్మకు సూసేకి సాంగ్ క్రెడిట్ ఇస్తూ ప్రశంసలు కురిపించారు.

"సీతా పయనంలోని సాంగ్స్ బాగున్నాయి. అందులో ఏ ఊరికి వెళతావే పిల్లా సాంగ్‌ వినగానే చంద్రబోస్‌ రాసి ఉంటారని ఫిక్స్‌ అయ్యా. ఆ పాట కొరియోగ్రఫీ బాగుంది. దీంతో ఎవరు చేశారని అడిగితే శ్రష్టి పేరు చెప్పారు. ఆమె చాలా బాగా చేసింది. పుష్ప 2లోని సూసేకి పాటకు 80 శాతం మూమెంట్స్‌ తనే కంపోజ్‌ చేసింది" అని తెలిపారు.

"దాంతోపాటు చిన్న చిన్నవి కూడా కంపోజ్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ క్రెడిట్‌ ను ఆమెకు ఇవ్వలేకపోయా. ఆల్ ది బెస్ట్" అంటూ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికి శ్రష్టికి ఇప్పుడు క్రెడిట్ దక్కిందని, కాస్త లేట్ అయినా సుకుమార్ ఇచ్చారని చెబుతున్నారు.

అయితే నిజానికి.. సుకుమార్ తన టీమ్ లోని నిజంగా అర్హులైన వారికి కచ్చితంగా క్రెడిట్ ఇస్తారు. ఏ వర్క్ సరిగ్గా చేసినా.. తగిన వాల్యూ ఇస్తారు. ఇప్పటికే మూవీ సక్సెస్ మీట్స్ లో అది మనం చూశాం. టీమ్ సభ్యుల వ్యక్తిగత సహకారాన్ని చక్కగా వివరిస్తారు. ఇప్పుడు సూసేకి సాంగ్ కు గాను శ్రష్టి వర్మను ప్రశంసించారు. ఏదేమైనా సుకుమార్ లెక్కే వేరు.