Begin typing your search above and press return to search.

ఇలా చెప్ప‌డం సుకుమార్ కే చెల్లింది!

సుకుమార్ నేడు పాన్ ఇండియాలో పెద్ద డైరెక్ట‌ర్. రాజమౌళి త‌ర్వాత స్థానం ఎవ‌రిది? అంటే సుకుమార్ ది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   29 May 2025 6:00 PM IST
ఇలా చెప్ప‌డం సుకుమార్ కే చెల్లింది!
X

సుకుమార్ నేడు పాన్ ఇండియాలో పెద్ద డైరెక్ట‌ర్. రాజమౌళి త‌ర్వాత స్థానం ఎవ‌రిది? అంటే సుకుమార్ ది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో స్టార్లు అంతా సుకుమార్ తో సినిమాలు చేయాల‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 'పుష్ప' స‌క్సెస్ అన్న‌ది సుకుమార్ ని అంత గొప్ప స్థానంలో కూర్చెబెట్టింది. ద‌ర్శ‌కు డిగా కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. అత‌డు సినిమా చేస్తాన‌నాలేగానీ వంద‌ల కోట్లు గుమ్మ‌రించ‌డానికి నిర్మాత‌లు, వ్యాపార వేత్త‌లు సిద్దంగా ఉన్నారు.

అంత గొప్ప స్థాయికి సుకుమార్ చేరినా? సుకుమార్ మూలాలు ఎంత మాత్రం మ‌ర్చిపోలేదు. తాను ఎలా ఎదిగాడు అన్న‌ది ప్ర‌తీ సంద‌ర్భంలో గుర్తు చేస్తూనే న‌వ‌త‌రానికి స్పూర్తిగా నిలుస్తున్నారు. నిజంగా ఇలా చెప్ప‌డం అన్న‌ది సుకుమార్ కి మాత్ర‌మే చెల్లిందా? అనిపిస్తుంది. 'పుష్ప' స‌క్సెస్ అనంత‌రం పాన్ ఇండియాలో గొప్ప పేరొచ్చింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ప్లాప్ ల్లో ఉన్న పూరి ముందుకెళ్లి కెరీర్ ఆరంభంలో మీ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఛాన్స్ కోసం తిరిగిన రోజులు గుర్తు చేసుకున్నారు.

అమీర్ పేట్ లో ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ గుర్తు చేసి పూరిని పాత జ్ఞాప‌కాల్లోకి తీసుకెళ్లారు. తాజాగా మ‌రోసారి యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టించిన సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసిన రోజును గుర్తు చేసుకున్నారు. అర్జున్ న‌టించిన 'హ‌నుమాన్ జంక్ష‌న్' సినిమాకు సుకుమార్ అసిస్టెంట్ గా ప‌నిచేసారట‌. ఈ విష‌యాన్ని నిన్న‌టి రోజున ఓ సినిమా ప్ర‌చారంలో తెలిపారు. ఇదెప్పుడో కొన్ని సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న.

కానీ తాను ఎదిగిన విధానాన్ని మ‌ర్చిపోకుండా అంద‌రి ముందు సుకుమార్ ఎంతో ఓపెన్ గా మాట్లాడారు. అలాగే ఉపేంద్ర స్వీయా ద‌ర్శ‌కత్వంలో న‌టించిన సినిమాల స్పూర్తితో త‌న సినిమాల‌కు స్క్రీన్ ప్లే రాసుకోవ‌డం అల‌వాటు చేసుకున్న‌ట్లు గుర్తు చేసారు సుకుమార్. అర్జున్, ఉపేంద్ర ఒక‌ప్పుడు పెద్ద స్టార్లు. ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా సినిమాలు చేస్తున్నారు. వాళ్ల ముందు సుకుమార్ అంత త‌గ్గాల్సిన ప‌నిలే క‌పోయినా? మూలాలు మ‌ర్చిపోకుండా మాట్లాడి న‌వ‌త‌రానికి స్పూర్తిగా నిలిచారు. ఇలా ఎంత మంది మాట్లాడ‌గ‌ల‌రు. అందుకు గ‌ట్స్ ఉండాలి.