లెక్కల మాస్టర్ ద్రోణాచార్య..మరి శిష్యులు?
టాలీవుడ్‌లో కొత్త తరం ఉరకలేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లని సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
By: Ravindar Gorantla | 6 March 2026 10:47 AM ISTటాలీవుడ్‌లో కొత్త తరం ఉరకలేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లని సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ విషయంలో కొంత మంది దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. స్టార్ డైరెక్టర్‌కు చెందిన శిష్యులే ఇందులో అత్యధికంగా ఉండటం గమనార్హం. గతంలో ఒక దశలో లెజెండరీ డైరెక్టర్స్ దాసరి నారాయణ రావు కోడిరామకృష్ణ, సాగర్ శిష్యుల హవా నడిచేది. కె. రాఘవేంద్రరావు శిష్యులు పెద్దగా రాణించిన దాఖలాలు లేవు ఒక్క రాజమౌళి తప్ప. దాసరి తరువాత సాగర్ శిష్యులే అత్యధికంగా ఇండస్ట్రీని రూల్ చేశారు. వారి శకం ముగుస్తోంది. ఇప్పుడు కొత్త దరం సంచలనాలు సృష్టించడం మొదలు పెట్టింది.
లెజెండరీ డైరెక్టర్ల శిష్యులు..
వరుసగా బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్‌లు ఇచ్చారు. అయితే క్రమ క్రమంగా వారి ప్రభావం తగ్గుతూ వస్తోంది. కొంత మంది అయితే ఇప్పుడు సినిమాలే చేయడం లేదు. కొంత మంది కొన్నేళ్లుగా మేకింగ్‌కి దూరంగా ఉంటున్నారు. దీంతో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్స్ శిష్యుల కొరత ఏర్పడింది. ఇప్పుడా కొరతని స్టార్ డైరెక్టర్ల శిష్యులు తీర్చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త సినిమాలతో అద్భుతాలు సృష్టిస్తూ హంగామా చేస్తున్నారు. కొంత మంది పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంటే మరి కొంత మంది కాన్సెప్ట్ ఓరియోండెడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు.
శిష్యులతో ఇండస్ట్రీలో హంగామా చేస్తున్న ఆ గురువు మరెవరోకాదు లెక్కల మాస్టర్ సుకుమార్. శిష్యులు బుచ్చిబాబు సాన, శ్రీకాంత్ ఓదెల, కార్తిక్ దండు, శ్రీ హుస్సేన్ షా కిరణ్. బుచ్చిబాబు సాన `ఉప్పెన`తో సంచలనం సృష్టించడం తెలిసిందే. తొలి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా వంద కోట్ల క్లబ్‌లో చేరి ఆశ్చర్యపరిచాడు. స్టార్లని సైతం ఆకట్టుకున్న బుచ్చిబాబు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా `పెద్ది` పేరుతో భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.
గురువుని మించిన శిష్యులు..
బుచ్చిబాబు సాన ప్రస్తుతం రామ్ చరణ్‌తో భారీ పాన్ ఇండియా మూవీగా `పెద్ది`ని తెరకెక్కిస్తుంటే అంతకు మించి అన్నట్టుగా శ్రీకాంత్ ఓదెల `ది ప్యారడైజ్`ని తెరకెక్కిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈమూవీని ఇప్పటికే నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నామి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గురువు సుకుమార్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే ఆయనని మించి శిష్యులవుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచే సినిమాలు చేస్తున్నారు. సుకుమార్ శిష్యుల్లో బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల ఆయన స్థాయి పాన్ ఇండియా సినిమాలని చేస్తూ గురువుని మించిన శిష్యులు అనిపించుకుంటున్నారు. శ్రీకాంత్ ఓదెల `ది ప్యారడైజ్`, బుచ్చిబాబు `పెద్ది` ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీరి తరహాలోనే మరో శిష్యులు కార్తిక్ దండు `వృషకర్మ` భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
నాగచైతన్య ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. వీరి తరహాలో కాకపోయినా మినిమమ్ బడ్జెట్‌లో సినిమాలు చేస్తున్న మరో శిష్యుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్. శ్రీవిష్ణుతో తను చేసిన `మృత్యుంజయ్` ఈ శుక్రవారం విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుండటంతో సుకుమార్, సుకుమార్ శిష్యులు నెట్టింట వైరల్ అవుతున్నారు. సుకురామ్ ద్రోణాచార్యుడని, ఆయన శిష్యులు అర్జున, భీమ, అశ్వద్ధామ, యుదిష్టిరులని ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాకుండా టాలీవుడ్‌లో సుకుమార్ శిష్యుల శకం మొదలైందని కామెంట్‌లు చేస్తున్నారు.
