Begin typing your search above and press return to search.

మీ వ‌ల్లే మ‌రో సినిమా అవ‌కాశం వ‌చ్చింది

1 నేనొక్క‌డినే మూవీని యూఎస్ ఆడియ‌న్స్ ఆదరించ‌డం త‌న కెరీర్ కు ఎంతో ప్ల‌స్ అయింద‌ని సుకుమార్ అన్నారు.

By:  Tupaki Desk   |   6 July 2025 1:18 PM IST
మీ వ‌ల్లే మ‌రో సినిమా అవ‌కాశం వ‌చ్చింది
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్లో ఇప్ప‌టికే ఏ స్టార్ హీరో చేయ‌ని ప్ర‌యోగాలు చేశారు. వాటిలో కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలుంటే మ‌రికొన్ని ఎక్స్‌పెరిమెంట‌ల్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. అలా చేసిన ప్ర‌యోగాల్లో ఒక‌టి 1 నేనొక్క‌డినే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ రిలీజ్ కు ముందు భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

కానీ రిలీజ్ త‌ర్వాత ఈ సినిమా ఇండియ‌న్ ఆడియ‌న్స్ కు అర్థం కాక పెద్ద‌గా ఆడ‌లేదు. 1 నేనొక్క‌డినే ఇండియాలో ఆడ‌క‌పోయినా యూఎస్ లో మాత్రం ఈ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఈ విష‌యం అందరికీ తెలిసిందే అయిన‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ సుకుమార్ తాజాగా తానా మ‌హాస‌భ‌ల్లో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. 1 నేనొక్క‌డినే సినిమాను యూఎస్ లోని తెలుగు ఆడియ‌న్స్ ఆదరించ‌డం వ‌ల్లే త‌న‌కు వేరే సినిమా అవ‌కాశ‌మొచ్చింద‌ని అన్నారు.

1 నేనొక్క‌డినే మూవీని యూఎస్ ఆడియ‌న్స్ ఆదరించ‌డం త‌న కెరీర్ కు ఎంతో ప్ల‌స్ అయింద‌ని సుకుమార్ అన్నారు. మ‌రో విష‌యంలో కూడా నార్త్ అమెరికాలోని తెలుగు ప్ర‌జ‌ల‌కు తాను థాంక్స్ చెప్పాల‌ని, ప్రొడ్యూస‌ర్ న‌వీన్ ను టాలీవుడ్ కు ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌ల‌న్నారు. అమెరికా నుంచి వ‌చ్చిన న‌వీన్ మైత్రీ మూవీ మేక‌ర్స్ అనే బ్యాన‌ర్ ను స్థాపించి, టాలీవుడ్ లో ఎన్నో మంచి మంచి సినిమాల‌ను నిర్మిస్తూ ఎంతోమందికి ఉపాధి క‌ల్పించార‌న్నారు.

ఈ ఈవెంట్ కు వ‌చ్చిన అల్లు అర్జున్ కు, దిల్ రాజుకు, ఆర్య టీమ్ కు అంద‌రికీ సుకుమార్ థాంక్స్ చెప్పగా, సుకుమార్ చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పుష్ప‌2 స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సుకుమార్, తన త‌ర్వాతి సినిమాను గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. రంగ‌స్థ‌లం త‌ర్వాత వీరిద్ది కాంబినేష‌న్ లో రానున్న రెండో సినిమా ఇది.